తెర‌పైకి టాటా జీవిత క‌థ‌..రేసులో మ‌హేష్‌!

Update: 2022-11-23 12:30 GMT
ఆ మ‌ధ్య టాలీవుడ్ లో సైతం బ‌యోపిక్ ల స‌న్నివేశం ఒక్క‌సారిగా హీటెక్కి చ‌ల్లారింది. మ‌హాన‌టి సావిత్రి  జీవిత క‌థ త‌ర్వాత వ‌రుస‌గా ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు గా రావ‌డం.. వైఎస్సార్ పాద‌యాత్ర నేప‌థ్యం స‌హా సీనియ‌ర్ న‌టుడు కాంతారావు తో పాటు ప్ర‌ముఖ‌ల క‌థ‌లు తెర‌కెక్కాయి. మ‌రోవైపు రాంగోపాల్ వ‌ర్మ సైతం అదే వేడిలో వ‌రుస‌గా బ‌యోపిక్ లు చేయ‌డంతో టాలీవుడ్ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారింద‌నిపించింది.

అయితే ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా ఆ ఊపు త‌గ్గింది. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల‌తో  బిజీ అవ్వ‌డంతో జీవిత క‌థ‌ల్ని మ‌ర్చిపోయారు. తాజాగా  ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా జీవిత క‌థ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. సుధ కొంగ‌ర  ఆబాధ్య‌త‌లు తీసుకున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

క‌థ ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ లో సినిమా లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో ర‌త‌న్ టాటా పాత్ర ఎవ‌రు పోషిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌ముఖంగా ఓ ముగ్గురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. టాటా పాత్ర‌లో  సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని అప్రోచ్ అవుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే త‌మిళ న‌టుడు సూర్య‌..బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా రేసులో  ఉన్నారు.

తెలుగు..త‌మిళ్..హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిచి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్ గా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్య‌త‌లు బ‌డా నిర్మాణ సంస్థ హంబ‌లే ఫిల్మ్స్  తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ బ్యాన‌ర్లో బ‌యోపిక్ నిర్మిస్తున్న‌ట్లు గ‌తంలోనే వార్త‌లొచ్చాయి. అలాగే తాను తెర‌కెక్కించోయే  జీవిత క‌థ‌లో సూర్య న‌టిస్తాడ‌ని సుధ కొంగ‌ర ఓ సంద‌ర్భంలో రివీల్ చేసారు.

అయితే హీరో విష‌యంలో  ఇప్పుడా స‌మీక‌ర‌ణాలు మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. కానీ బ‌యోపిక్ లో మ‌హేష్ న‌టించ‌డానికి ఛాన్సెస్ త‌క్కువ‌గానే ఉన్నాయి. అత‌ను క‌మ‌ర్శియ‌ల్ సినిమాల తో పాటు సాప్ట్ క‌థ‌ల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తుంటారు. ఇన్నోవేటివ్ థాట్స్ కి  దూరంగా ఉంటారు. మ‌రి టాటా బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్ వ‌స్తే న‌టిస్తారా?  లేదా? అన్న‌ది చూడాలి.

'ఆకాశ‌మే నీ హ‌ద్దురా' సినిమాతో సుధ కొంగ‌ర జాతీయ స్థాయిలో ఫేమ‌స్ అయ్యారు. ఆ సినిమాకి  నేష‌న‌ల్ అవార్స్డ్ ల‌భించాయి. అలాగే అంత‌కు ముందు తెర‌కెక్కించిన  'గురు' మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో టాటా బ‌యోపిక్ ని ఎలా మ‌ల‌చ‌బోతున్నారు? అన్న ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News