సరిగ్గా ‘రుద్రమదేవి’ విడుదలకు ఒక్క రోజు ముందు గుణశేఖర్ అండ్ టీంకి ఓ తీపి కబురు అందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వీరనారి రుద్రమదేవి జీవిత కథతో సినిమా తీసినందుకు ‘రుద్రమదేవి’కి రాష్ట్రంలో ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాను విడుదల చేసుకున్నాడు గుణశేఖర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగారో లేదో కానీ.. అక్కడ కూడా పన్ను మినహాయింపు వచ్చి ఉంటే సినిమాకు చాలా మేలు జరిగేది. ఐతే తెలంగాణ వరకైనా చేశారు సంతోషం. దాని వల్ల తక్కువలో తక్కువ రెండు కోట్లయినా మిగిలేలా ఉంది.
నైజాం ఏరియాలో ‘రుద్రమదేవి’ తొలి మూడు రోజుల్లో రూ.10.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మామూలుగా అయితే షేర్ రూ.6.5 కోట్ల దాకా ఉండేది. కానీ 15 శాతం ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ కలిసి రావడంతో ఇందులో కోటిన్నర రూపాయల ఆదాయం పెరిగింది. ట్యాక్స్ కాకుండా థియేటర్ల అద్దెలు - ప్రింట్లు - ఇతర ఖర్చుల్ని కలుపుకుంటే వచ్చే నెట్ వసూళ్లే షేర్ అయ్యాయి. మొత్తం రూ.8.2 కోట్ల ఆదాయం వచ్చింది. కేసీఆర్ ఇచ్చిన మినహాయింపు వల్ల ఇప్పటికే రూ.1.5 కోట్ల దాకా ఆదాయం పెరిగింది.
మరి అదనంగా వచ్చిన ఈ ఆదాయం ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఖాతాలోకి వెళ్తుందా.. లేక గుణశేఖర్ కు దక్కుతుందా అన్నది ఆసక్తిరం. వాస్తవానికైతే ఇది గుణశేఖర్ కే దక్కాలి. ఎందుకంటే పన్ను ఉంటుందన్న కోణంలోనే రాజుకి రూ.12 కోట్లకు రైట్స్ అమ్మాడు. ఐతే సినిమా అమ్మకం పూర్తయిపోయింది. ఇప్పుడు పన్ను మినహాయింపు వచ్చింది. కాబట్టి వసూళ్లయితే రాజు ఖాతాలోకే వెళ్తుంటాయి. బహుశా ఇద్దరూ వాటా పంచుకుంటారేమో.