కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు, నేటివిటీ ప్రధానంగా గ్రామీణ నేపథ్య కథలకు ప్రేక్షకులు పట్టంకడుతున్నారు. దీంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ తరహా కథల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వస్తున్న చిత్రం `జయమ్మ పంచాయితీ`. యాంకర్, నటి సుమ ప్రధాన పాత్రలో నటిస్తోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు.
శ్రీకాకుళం యాసలో సాగే ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంబలో ఈ చిత్ర ట్రైలర్ ని హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు. రా బావా మా ఊళ్లో పంచాయితీ సూద్దువుగానీ` అంటూ ఓ వ్యక్తి చెబుతున్న డైలాగ్ లతో ట్రైలర్ మొదలైంది. జయమ్మ తన సమస్య కోసం పంచాయితీ పెట్టడం.. అయితే తన సమస్య ని పట్టించుకోక పోవడంతో ఎదురుతిరిగిన జయమ్మ ఏం చేసింది? అన్నది అసలు కథ. శ్రీకాకుళం యాసలో సాగే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది.
సుమ నటన ప్రధాన హైలైట్ గా నిలవనుంది. ఈ చిత్ర ట్రైలర్ తో పాటు సుమపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై పవర్ స్టార్ నుంచి ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని వీక్షించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.
ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన శ్రీకాకుళం యాసలో సినిమా తీయడాన్ని చూసి నేను గర్వపడుతున్నానని, మన భాష, సంస్కృతి, మరియు వైవిద్యాన్ని చూపించే చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.
Full View