ఒక సినిమాని ఎంత కష్టపడి తీసినా అది జనాల్లోకి వెళ్ళడానికి అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ - ట్రైలర్ అంటూ సినిమాకి సంబంధించిన ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తూ బజ్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో ఓ సినిమా టీజర్ లేదా సాంగ్స్.. ట్రైలర్ ని వేరే హీరోతో లాంఛ్ చేయించడం అనేది ట్రెండ్ గా నడుస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది.
ప్రమోషన్ కంటెంట్ కి సోషల్ మీడియాలో క్రేజ్ కోసం వేరే సెలబ్రిటీలు లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పడం.. లేదా పాటలు లాంఛ్ చేయడం వంటి యాక్టీవిటీలు ఎక్కువైపోయాయి. దీన్ని పెద్ద హీరోలు అనుసరించడం లేదు కానీ చిన్న హీరోలు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు. చిన్న సినిమా వాళ్లైతే తప్పక వారి కంటెంట్ ని ఎవరో ఒక సెలబ్రిటీతో లాంఛ్ చేయించడానికి నానా పాట్లు పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఇలా వచ్చే వారిని ప్రొత్సహించడంలో విజయ్ దేవరకొండ ముందున్నాడని చెప్పవచ్చు. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చాలు వెనకముందు చూసుకోకుండా వీడీ ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఒకరిద్దరు స్టార్ హీరోలు సైతం చిన్న సినిమాల ప్రమోషన్స్ కి తమ వంతు సహాయం చేస్తున్నారు.