ఆమ్మో తేజ్ ఏంటిది

Update: 2018-07-08 05:17 GMT
ఏ హీరోకైనా ఓపెనింగ్స్ చాలా కీలకంగా మారిన తరుణంలో ఫస్ట్ డే కలెక్షన్ ను బట్టే క్రేజ్ ను కొలత వేసే ట్రెండ్ వచ్చేసింది. నిన్నా మొన్నటి దాకా మెగా హీరోల్లో ఓ మాదిరి చెప్పుకోదగ్గ ఇమేజ్ తో నెట్టుకొస్తున్న సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పరిస్థితి ఎంత కిందకు వచ్చేసిందో తేజ్ ఐ లవ్ యు తేటతెల్లం చేసింది. రివ్యూలు పూర్తి నెగటివ్ గా రావడంతో పాటు పబ్లిక్ టాక్ కూడా కొంచెం కూడా ఫేవర్ గా లేకపోవడంతో యావరేజ్ మార్క్ అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 2 కోట్ల షేర్ కూడా రాకపోవడం మెగా ఫాన్స్ ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది. దారుణమైన సినిమాగా పేరు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ కష్టపడి మొదటి రోజు 2 కోట్ల మార్కుని దాటగలిగింది. కానీ తేజ్ ఐ లవ్ యు కు అది కూడా సాధ్యం కాలేదు. ఫైనల్ గా 1 కోటి 82 లక్షల షేర్ దగ్గరే ఆగిపోయి డేంజర్ బెల్ ని గట్టిగా మ్రోగించేసింది. ఏరియాల వారీగా చూస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుంది.  

నైజామ్ - 47 లక్షలు

సీడెడ్ - 28 లక్షలు

ఉత్తరాంధ్ర- 26 లక్షలు

గుంటూరు - 25 లక్షలు

ఈస్ట్ - 19 లక్షలు

వెస్ట్ - 18 లక్షలు

నెల్లూరు - 7 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం - 1 కోటి 82 లక్షలు

థియేట్రికల్ బిజినెస్ 16 కోట్ల దాకా జరిగింది. వీక్ ఎండ్ ఏదోలా ఒక రెండు కోట్ల దాకా వస్తాయి అనుకుంటే రేపటి నుంచి విపరీతమైన డ్రాప్ ఉంటుందనే అంచనాలో ట్రేడ్ సైతం నష్టాలను లెక్కలేసే  పనిలో ఉంది. ఓవర్ సీస్ గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. లవర్ బాయ్ గా తనవరకు బాగానే చేసినప్పటికీ దర్శకుడు కరుణాకరన్ టేకింగ్ మరీ తీసికట్టుగా ఉండటంతో దాని ఫలితం ఇప్పుడు వసూళ్ల రూపంలో బయటపడుతున్నాయి. పుంజుకునే అవకాశాల గురించి కరుణాకరన్ మాట్లాడుతున్నాడు కానీ అది జరిగే పని కాదు. 
Tags:    

Similar News