దర్శకుడు తేజ షూటింగ్ సమయంలో నటుల్ని మాత్రమే హింస్తాడుట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నారు. సాధారణంగా.. చాలామంది దర్శకులు, కొందరు నిర్మాతలు కూడా షూటింగ్ సమయంలో చాలా కఠినంగా ఉంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. షూటింగ్‌లో అల్లరిచిల్లరగా ఉండడం వల్ల చాలా సమయం వృథా పని నష్టం అవుతూ ఉంటుది గనుక.. ప్రోడక్ట్ అవుట్ పుట్ అనుకున్న విధంగా రావడానికి మాత్రమే వీరు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది చాలా సహజం. అయితే దర్శకుడు తేజ విషయంలో మాత్రమే ఆయన నటుల్ని షూటింగ్ లో కొడతారని, కొట్టి మరీ.. తనకు కావాల్సిన ట్లు చేయించుకుంటారని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన కూడా సరదాగా మీడియాతో పంచుకుంటున్నారు. తాను నటుల్ని మాత్రమే హింసిస్తానని చెబుతున్నారు.
మాత్రమే.. అనడం ద్వారా ఆయన తాను షూటింగ్ ప్రాంతంలోకి పాములు వచ్చినా కూడా వాటిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తన తాజాచిత్రం హోరాహోరీ గురించిన వివరాలు వెల్లడిస్తూ.. సినిమాకు కథ పరంగా తాను అనుకున్నట్లు తీయడానికి కర్ణాటకలో వర్షపాతం ఎక్కువగా ఉండే ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు వెళ్లి షూటింగ్ చేశారట. అయితే తీరా అక్కడకు వెళ్లాక.. అక్కడ కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందట. నిజానికి షూటింగ్ సెట్ లోకి కూడా కింగ్ కోబ్రాలు తరచూ వచ్చేవిట. అయినా.. వాటికి ఇబ్బంది కలిగించకుండా షూటింగ్ చేశారుట.. ఈ కబుర్లన్నీ ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంలోనే.. తాను షూటింగ్ లో నటుల్ని హింసిస్తానే గానీ.. షూటింగ్ స్పాట్ లో పాముల్ని కూడా ఇబ్బందిపెట్టననీ, కనీసం అక్కడి అడవుల్లో ఒక ఆకు కూడా తెంపకుండా షూటింగు పూర్తి చేశాం అని తేజ చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. నటుల్ని ఇబ్బంది పెట్టినా.. అది వారి భవిష్యత్తుకోసం, సినిమా బాగుండడం కోసమే కదా అంటున్నారు.. నిజమే మరి!