బాహుబలి సినిమా తర్వాత రానా తన కెరీర్ కు కాస్త స్పీడ్ పెంచాడనే చెప్పాలి.. అందరి హీరోల్లా కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నడు. ఎవరు ఊహించని విధంగా ఘాజి సినిమాతో మంచి హిట్ అందుకొని ఇప్పుడు మరో వినూత్న కథతో రాబోతున్నాడు.. తేజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లతో భారీ అంచనాలు పెంచిన తేజా ఇప్పుడు భారీగా ప్రమోషన్లను పెంచాలని చూస్తున్నాడు.
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో తేజా హీరోయిన్స్ ను ఏ రేంజ్ లో యూస్ చేసుకున్నాడో తెలియదు గాని.. వారితో కలిసి చేయిస్తున్న ప్రచారం మాత్రం తార స్థాయికి చేరుతోంది. ఇప్పటికే ఆడియెన్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్థాయిని ఏ మాత్రం తగ్గించకూడదని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కాజల్ - క్యాథెరిన్ ని ప్రతీ మీడియా సమావేశాల్లో పాల్గొనమని చెబుతున్నారట తేజ. ఇందులో భాగంగా రీసెంట్ గా ఈ ఇద్దరు హీరోయిన్స్ దర్శకుడితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాధ పాత్రను చేస్తున్న కాజల్.. రాణిగా అలరించనున్న క్యాథరీన్.. ఇల తమ నాయకుడితో కలసి ప్రచారం చేయడం భలే ఉందబ్బా అంటున్నారు చూపరులు.
అయితే ఈ చిత్రం తేజ కెరీర్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఆయనకి సరైన విజయాలు లేవు.. ఆయన ఇంకా పాత కథలనే అటు ఇటు తిరేగేస్తున్నాడని విమర్శలు వెలువడ్డాయి.. దీంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టి మళ్ళి గాడిలో పడాలని చూస్తున్నాడు.. బాహుబలి హిట్ తో తమిళ్ లో సూపరిచుతుడైన రానా అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు..రీసెంట్ గా కోలీవుడ్ లో చేసిన ప్రమోషన్స్ రెస్పాన్స్ కి తేజా కాన్ఫిడెన్స్ గా ఉన్నారట. ఈ సినిమా యూనిట్ చేస్తున్న ప్రమోషన్ కి ప్రేక్షకుడిని థియేటర్లు వరకు రావడం ఖాయం కానీ వచ్చిన ప్రేక్షకుడిని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి..