చిత్రం.. నువ్వు నేను.. జయం సినిమాలతో అప్పట్లో తిరుగులేని విజయాలందుకున్నాడు తేజ. కానీ ఆ తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు తీశారో తెలిసిందే. తేజ కెరీర్లో ఈ మూడు మినహాయిస్తే యావరేజ్ అనదగ్గ సినిమా కూడా లేదు. ‘జయం’ తర్వాత ఒకటి రెండు కాదు.. ఏకంగా పది ఫ్లాపులు తీశాడు తేజ. అందులో కొన్నయితే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘జయం’ సినిమానే అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నాడని.. ఆయన అప్ డేట్ కాలేదని తేజ మీద ఎన్నో విమర్శలొచ్చాయి. చివరగా ఆయన తీసిన ‘హోరాహోరి’ గురించి ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే అది మరో ‘జయం’ లాగే అనిపించడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు.
ఇప్పుడు తేజ తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’కి కూడా అంత మంచి టాక్ ఏమీ రాలేదు. కాకపోతే రానా నటించడం వల్ల.. చక్కటి ప్రమోషన్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఈ మాత్రానికే తేజ తన గురించి తాను చెప్పుకుంటున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తన సినిమాను అర్థం చేసుకునే స్థాయి రివ్యూ రైటర్లకు లేకుండా పోయిందంటూ తేజ చేసిన కామెంట్ల సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా తానెప్పుడూ ఐదేళ్లు ముందుండి ఆలోచిస్తుంటానని.. తన సినిమాలు కూడా అలాగే ఉంటుంటాయని స్టేట్మెంట్ ఇచ్చాడు తేజ. అందుకు ఆయన ఉదాహరణగా.. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానా కేథరిన్ ఇంటికి వెళ్లడం.. షర్టు విప్పి ఆమె మీదికి లంఘించడం.. ఆపై కేథరిన్ బయటికి వచ్చి కార్లో అతడి మీదికి దూకడం.. కారు ఊగడం గురించి చెప్పుకున్నారు.
ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చూపించి.. తాను చాలా అడ్వాన్స్ అని తేజ గొప్పలు పోవడం చూసి జనాలకు దిమ్మదిరిగిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో దీని మీద సెటైర్లు పడుతునన్నాయి. దీన్నే కొత్తదనంగా.. అడ్వాన్స్ ఆలోచనగా భావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ తేజ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించుకుంటోంది కానీ.. ఇందులో ఏమీ కొత్తదనం లేదని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా 90ల్లో వచ్చిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’ సినిమాను గుర్తు చేస్తున్నారు చాలామంది. దీంతో పోలిస్తే అది చాలా పకడ్బందీగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వస్తున్నంత మాత్రాన తేజ తానేదో గొప్ప సినిమా తీసేశానని.. అడ్వాన్స్డ్ గా ఆలోచించేస్తున్నానని అనుకోవడం.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.