కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. అది కొంచెం ఓవర్ అయితేనే ప్రాబ్లెం. ఒకప్పుడు టాలీవుడ్ చరిత్రను తిరగరాసే ‘జయం’ లాంటి హిట్టు ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ తేజ.. ఇప్పుడు హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుండటానికి ఈ ఓవర్ కాన్ఫిడెన్సే కారణం. ‘జయం’ ఇచ్చిన ఉత్సాహంతో తానేం తీసినా జనాలు చూస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి.. వరుస ఫ్లాపులు కొని తెచ్చుకున్నాడు. కానీ ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం అలాగే ఉండటం విశేషమే. కొత్త సినిమా ‘హోరాహోరీ’ విషయంలోనూ తేజ పిచ్చ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే మహేష్ సినిమా ‘శ్రీమంతుడు’కు ఎదురెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
శ్రీమంతుడు ఈ నెల 7న విడుదలవుతుండగా.. 14నే హోరాహోరీ విడుదల చేయాలని నిర్మాత దామోదర ప్రసాద్ పై ఒత్తిడి తెస్తున్నాడట తేజ. ఈ డేటు వదిలేస్తే 21న కిక్ వస్తుంది. 28న డైనమైట్ వచ్చే అవకాశముంది. సెప్టెంబరు 4న రుద్రమదేవి రెడీగా ఉంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 14న అయితే సోలోగా రావడానికి ఛాన్స్ ఉంటుందని.. అప్పటికి శ్రీమంతుడు జోరు తగ్గుతుందని తేజ భావిస్తున్నాడు. శ్రీమంతుడు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ‘హోరాహోరీ’ దానికి భిన్నమైన సినిమా కాబట్టి దీనికుండే ప్రేక్షకులు దీనికుంటారని తేజ నమ్మకం. ఐతే ‘శ్రీమంతుడు’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మహేష్ స్టామినా ఏంటో తెలిసిందే కాబట్టి.. హిట్ టాక్ వస్తే కనీసం రెండు వారాలు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. కాబట్టి శ్రీమంతుడు టాక్ ను బట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే బెటరేమో.