`నేనే రాజు నేనే మంత్రి` వంటి బ్లాక్ బస్టర్ తీసిన తేజ ఆ తర్వాత సీత లాంటి డిజాస్టర్ ని తీశాడు. ఆ తరవాత రెండు ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో `అలివేలు మాంగ వెంకటరమణ` ఒకటి. ఈ మూవీలో గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తారని నాయిక కోసం వెతుకుతున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.
ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నుంచి అనూహ్యంగా గోపిచంద్ వైదొలిగారని తాజాగా వెల్లడైంది. ఇందులో అలీవెలు పాత్ర కోసం తేజా ఇటీవల తాప్సీని లాక్ చేసారు. కథ కథనం తన పాత్ర ఆకట్టుకోవడంతో తాప్సీ ఈ చిత్రానికి సంతకం చేసారు.
అయితే మొగుడు లాంటి ఫ్లాప్ తర్వాత గోపిచంద్ - తాప్సీ కాంబినేషన్ పై తాప్సీ సందేహం వెలిబుచ్చిందని దాంతో కథానాయకుడిగా వేరొక బాలీవుడ్ హీరోని ఎంపిక చేసే ఆలోచనలో తేజ ఉన్నారని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొగుడు రిజల్ట్ వల్ల కూడా గోపిచంద్ తో పనిచేయడానికి తాప్సీ సిద్ధంగా లేదన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
`అలివేలు మాంగ వెంకటరమణ`ను పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి తేజ ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడితో చర్చలు జరుపుతున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులో నాయకానాయికల గురించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. మరోవైపు గోపిచంద్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కోసం మారుతితో చర్చలు జరుపుతున్నారు. సీటీమార్ పూర్తయితే తదుపరి ప్రకటన వెలువడుతుందట.