కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన దసరా - దీపావళి పండుగలకు కొన్ని క్రేజీ మూవీస్.. మీడియం రేంజ్ హీరోల సినిమాలు సందడి చేశాయి. డిసెంబర్ మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు చిన్న సినిమాలు ఈ శుక్రవారం థియేటర్ల బాట పట్టనున్నాయి.
మరికొన్ని ఆసక్తికర సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. రేపు (నవంబర్ 19) ఒక్కరోజే పది సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే అందులో 'అద్భుతం' మాత్రమే కాస్త క్రేజ్ ఉన్న సినిమా అని చెప్పవచ్చు.
యువ హీరో తేజ సజ్జా - శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం ''అద్భుతం''. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ సినిమాని నేరుగా డిజిటల్ మాధ్యమంలో విడుదల చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో నవంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు - కామెడీ, సస్పెన్స్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
''అద్భుతం'' ట్రైలర్ ని బట్టి ఇదొక టైమ్ ట్రావెల్ లాంటి విభిన్న కథాంశంతో రూపొందిన ఫాంటసీ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి ఒకే ఫోన్ నంబర్ ఉండటం వల్ల ఏమవుతుందనే వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతోంది. మరి తేజ - శివానీ జీవితాల్లో జరిగిన అద్భుతం ఏంటి? ఒకే ఫోన్ నంబర్ ని వినియోగిస్తూ వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హీరోహీరోయిన్లు ఇద్దరివీ తెలిసిన మొహాలే కావడం.. ప్రశాంత్ వర్మ కథ అవడంతో అందరి దృష్టి 'అద్భుతం' మీద పడింది. అందులోనూ ఈ ఏడాది ప్రారంభంలో 'జాంబీరెడ్డి' వంటి సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. రథన్ సంగీతం సమకూర్చారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఒరిజినల్స్ కు చెందిన సృజన్ ఎరబోలు సహ నిర్మాతగా వ్యవహరించారు. రేపు హాట్ స్టార్ లో రిలీజ్ అవుతున్న 'అద్భుతం' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.