'అ!' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ వర్మ.. మొదటి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన 'కల్కి' 'జోంబీ రెడ్డి' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ లతో కమర్షియల్ ఎంటర్టైనర్ లను రూపొందించడం అనేది క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యొక్క ప్రత్యేకత. ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన మూడు డిఫరెంట్ జోనర్స్ సినిమాలు కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ''హను-మాన్'' అనే పేరుతో మరో కొత్త జోనర్ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు ప్రశాంత్.
''హను-మాన్'' అనేది ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ. దీని కోసం 'జోంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత హీరో తేజ సజ్జా - డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కు విశేష స్పందన వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తుందని హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా అంజనాద్రి ప్రపంచం నుండి 'హనుమంతుడి'ని పరిచయం చేసే 65 సెకన్ల గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లిమ్స్ ని విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.
''హను-మాన్'' ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జా దట్టమైన అడవిలో ఒక చెట్టుపై నిలబడి, స్లింగ్ షాట్ తో తన టార్గెట్ ని కొట్టడానికి రెడీగా ఉండటాన్ని చూడవచ్చు. యువ హీరో తన కళ్లలో తీవ్రతతో పోస్టర్ లో చురుగ్గా కనిపిస్తున్నాడు. అలానే సూపర్ హీరోగా నటించడానికి అద్భుతమైన మేకోవర్ అయ్యాడు. కోరమీసంతో ఉన్న తేజ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అతను ప్రింటెడ్ షర్టు మరియు తెల్లటి పైజామా ధరించి ఉన్నాడు. తేజ మెడ మీద నల్లటి దారంతో అద్భుతమైన సిల్వర్ కలర్ లాకెట్టును మనం చూడవచ్చు. అతను కస్టమ్ మేడ్ ఫుట్ వేర్ కూడా ఆకర్షణగా నిలిచింది.
'హను-మాన్' గ్లిమ్స్ విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ అంజనాద్రి అనే కొత్త మరియు ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు అనిపిస్తుంది. ఈ వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జారిపోవడం మరియు దూకడం మరియు స్లింగ్ షాట్ ను షూట్ చేయడం కనిపిస్తుంది. గట్టిగా భూమి మీద గుద్దినప్పుడు సూపర్ హీరో యొక్క పంచింగ్ పవర్ చూపిస్తోంది. చివర్లో ఓ కణం నుంచి శక్తి విడుదలయ్యే దృశ్యాలను కనిపిస్తున్నాయి. సౌండ్ డిజైన్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ విజువల్స్ బాగా ఎలివేట్ చేశాయని చెప్పవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లిమ్స్ రెండూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడమే కాకుండా.. బిగ్ స్క్రీన్ మీద విజువల్ ట్రీట్ గ్యారంటీ అని హింట్ ఇచ్చాయి.
'హను-మాన్' సినిమాలో ఇతర సూపర్ హీరో చిత్రాల మాదిరిగానే సూపర్ ప్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లు - సూపర్ హీరో ఎలివేషన్స్ ఉండబోతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈరోజు శనివారం అన్ని భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
భారీ స్థాయిలో రూపొందే ''హను-మాన్'' చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు భాగం అవుతున్నారు. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఇతర తారాగణం మరియు టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Full View