ఎలాగైనా పట్టేసుకునేందుకు ప్లాన్స్ రెడీ

Update: 2017-07-18 06:03 GMT
టాలీవుడ్ ని ప్రస్తుతం మత్తు మందుల వాడకం అనే టాపిక్ కుదిపేస్తోంది. ఇప్పటికే డజన్ మందికి తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు అందాయి. రేపటి నుంచే విచారణ కూడా ప్రారంభం కానుంది. తొలి రోజున దర్శకుడు పూరీ జగన్నాధ్ ను అధికారులు విచారించనున్నారని అంటున్నారు.

అయితే.. టాలీవుడ్ సెలబ్రిటీల్లో డ్రగ్స్ వినియోగించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని అధికారులు ఫిక్స్ అయ్యారట. ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే.. ఈ విషయంలో దొరికితే మాత్రం వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి నుంచి సూచనలు వచ్చాయనే టాక్ ఉంది. అయితే.. ఒంట్లో ఉండే డ్రగ్స్ అవశేషాలను తొలగించుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారట. అలోవెరా జ్యూస్ ను తాగడం వంటి.. పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ఇంత షార్ట్ టెర్మ్ లో ఒంట్లో నుంచి పూర్తిగా డ్రగ్స్ ను తొలగించడం అసాధ్యం అంటున్నారు వైద్యులు.

సాధారణంగా డ్రగ్స్ వినియోగదారుల్లో చాలామంది సప్లయర్లుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరినీ వదిలిపెట్టే యోచన అధికారులకు లేదు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేస్తారని తెలుస్తోంది. డ్రగ్స్ అవశేషాలను ఒంట్లో నుంచి పూర్తిగా తరిమేసే యాంటీ డోట్స్ కూడా ఏమీ లేవని చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా ఎక్కువ డోస్ లో డ్రగ్స్ ను ఉపయోగించేవారు.. తప్పించుకునే అవకాశం ఏమాత్రం ఉండదని అంటున్నారు.
Tags:    

Similar News