'కేసీఆర్ ఆశీస్సులతో సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ'

Update: 2018-08-20 16:42 GMT
అర్జున్ రెడ్డితో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం హిట్‌ తో ఇండస్ట్రీలో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన హీరోల్లో ప్రస్తుతం పిచ్చ క్రేజ్ ఉన్న హీరో అయిన విజయ్‌ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే.. తెలంగాణలో తాజాగా ఆయన్ను సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తూ వెలిసిన ఒక ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీస్సులు విజయ్‌కు ఉన్నాయంటూ పెట్టిన ఆ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణకు చెందినవాడైనప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఇలా ఒక ప్రాంతానికే పరిమితం చేసేలాంటి భావనలను ఎంతవరకు ఆమోదిస్తారో చూడాలి.
   
మరోవైపు విజయ్ దేవరకొండ - రష్మిక మందన జంటగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సినిమా ఆస్ట్రేలియాలో టాప్ బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి కలెక్షన్లలో అగ్రస్థానం దక్కించుకుంది. గీత గోవిందం అమెరికాలో ఇప్పటిదాకా 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే.
   
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ - జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలను తాజాగా ఆస్ట్రేలియాలో గీత గోవిందం వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. ఆస్ట్రేలియాలో గోల్డ్ - సత్యమేవ జయతే సినిమాలు ఈ వారాంతానికి 1,92,306 డాలర్లు వసూలు చేయగా - ఒక్క గీత గోవిందం సినిమాకే 2,02,266 డాలర్లు వచ్చాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు గీత గోవిందం ముందు నిలబడలేకపోతున్నాయట. మరి ఇంత పొటెన్షియాలిటీ ఉన్న హీరో ఇలా ఒక ప్రాంతానికే పరిమితమయ్యేలా అభిమానుల చట్రంలో ఇరుక్కోకుండా ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News