ఈ మధ్య ఎక్కడ చూసినా, ముఖ్యంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సినిమా పేరు మేమ్ ఫేమస్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్స్ అందరూ కలిసి వచ్చారు. చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, సింగర్స్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దీంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. ఇంత మంది చెబుతున్నారంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉంది అనే విషయం అర్థమౌతోంది.
చాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ బ్యానర్ సంయుక్తంగా ఈ మేమ్ ఫేమస్ సినిమాని నిర్మించాయి. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం కూడా అతనే చేస్తుండటం విశేషం. ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో రైటర్ పద్మభూషణ్ వంటి సూపర్ హిట్ తో మన ముందుకు వచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. మే 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ మూవీ గురించి హీరో సుమంత్ ప్రభాస్ వివరించాడు. తాను కాలేజీలో తన స్నేహితులతో కలిసి పిల్లా పిల్లగాడు వెబ్ సిరీస్ చేశానని చెప్పాడు. అది చూసి అనురాగ్, శరత్ లు తనను సంప్రదించారని చెప్పాడు. మంచి కథతో వస్తే సినిమాకి ఏం కావాలో అది చేస్తామని వాళ్లు తనకు హామీ ఇచ్చారని చెప్పాడు. దీంతో తాను కథ రెడీ చేసుకున్నానని, అయితే ఆ కథను ఎలా చెప్పాలో కూడా తనకు తెలియలేదన్నాడు.
దాదాపు ఆ కథ చెప్పడానికి తనకు ఆరు గంటలు పట్టిందని చెప్పాడు. అనురాగ్, శరత్ లకు తన కథ బాగా నచ్చిందని చెప్పాడు. ఈ మూవీకి డైరెక్టర్, రచయితగా తాను ఉండగా, హీరో కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశామని చెప్పాడు. అయితే ఆ పాత్రను ఎవరూ సరిగా చేయలేకపోయారని, దీంతో మూవీ ప్రారంభించడానికి పది రోజుల ముందు తానే హీరోగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
ఈ సినిమా చేసినవాళ్లమంతా కొత్తవాళ్లమని, మూవీ ట్రయల్ షూట్ ఫోన్ లో చేశామని చెప్పడం విశేషం. సెట్స్ కి వెళ్లిన తర్వాత సినిమాపై ఫుల్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ వచ్చాయని చెప్పాడు. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ కథ అని వివరించాడు.
ఈ కాలం యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ముగ్గురు యువకుల కథగా ఈ సినిమా సాగుతుందని చెప్పాడు. ప్రతి పల్లెటూరులో ఫేమస్ అవ్వాలని తాపత్రయపడే కుర్రాళ్ల కథే ఈ సినిమా అని చెప్పాడు. అందుకే ఈ సినిమాకి మేం ఫేమస్ అని పేరు పెట్టామని చెప్పాడు. చాలా మంది కొత్త వాళ్లు ఈ సినిమాలో నటించారని, వాళ్లు కూడా చాలా అద్భుతంగా నటించారని చెప్పాడు.