తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ 4వ తారీకున ఈ సీజన్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. కంటెస్టెంట్స్ ఎంపిక తుది దశకు చేరుకుంది. పలువురు కంటెస్టెంట్స్ తో ఒప్పందాలు జరుగుతున్నాయి. మరో వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన సెట్ తుది దశ నిర్మాణం కూడా జరుగుతుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అందుకు సంబంధించిన మొదటి ప్రోమో కూడా వచ్చేసింది. అతి త్వరలో మరో ప్రోమోతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగార్జున సీజన్ 3 నుండి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఆయన సీజన్ సీజన్ కి పారితోషికం పెంచుతూ పోతున్నాడు.
గత సీజన్ ని నాగార్జున 12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పారితోషికం 15 కోట్ల రూపాయలకు పెరిగింది అంటూ సమాచారం అందుతోంది.
నాగార్జున మాత్రమే బిగ్ బాస్ హోస్ట్ గా తెలుగు హీరోల్లో ఆసక్తి చూపిస్తున్నాడు.. ఆయన మాత్రమే సెట్ అవుతాడు అనే అభిప్రాయం ఉంది. అందుకే ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి మరీ షో నిర్వాహకులు చేయిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 వంద రోజులకు పైగా ఉంటుంది. ప్రతి వారం లో ఒక రోజు చిత్రీకరణ కోసం నాగార్జున డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. శనివారం రోజే శని మరియు ఆదివారం యొక్క ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుతున్నారు. వారంలో ఒక్క రోజు ఈ సీజన్ లో నాగార్జున పాల్గొన్నందుకు గాను 15 కోట్ల పారితోషికం అందుబోతున్నాడు.
మరో వైపు నాగార్జున ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. వచ్చే అక్టోబర్ లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా కు ప్రవీన్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున బంగార్రాజు సినిమా తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.