టికెట్ కౌంటర్: కార్తి కామెడీకే ఓటు పడింది

Update: 2016-10-31 07:32 GMT
ఈ దీపావళి పండుగను టాలీవుడ్ కంప్లీట్ గా మిస్ అయిపోయింది. పండుగను క్యాష్ చేసుకునేందుకు ఒక్క తెలుగు సినిమా కూడా రాలేకపోయింది. ఈ గ్యాప్ ను కోలీవుడ్ డబ్బింగ్ సినిమా కాష్మోరా కరెక్ట్ గా క్యాష్ చేసేసుకుంది.

1. కాష్మోరా: కార్తీ నటించిన కాష్మోరాపై ముందు నుంచి అంచనాలు ఉండగా.. అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్స్ రాబట్టింది ఈ చిత్రం. తమిళ్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు దక్కాయంటే.. ఈ మూవీపై మనోళ్ల ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇక టాక్ యావరేజ్ గా ఉన్నా.. కొత్త సినిమా చూడాలని అనుకునే జనాలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో.. కాష్మోరాకే ఓటేశారు చాలామంది.

2. యే దిల్ హై ముష్కిల్: కరణ్ జోహార్ డైరెక్షన్ లో రణబీర్ కపూర్-ఐశ్వర్యా రాయ్-అనుష్క శర్మలు నటించిన యే దిల్ హై ముష్కిల్.. దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను సాధించగలిగింది. ముఖ్యంగా నైజాం ఏరియాలోను.. మల్టీప్లెక్స్ లలోనూ ఈ బాలీవుడ్ మూవీ కుమ్మేస్తోందనే చెప్పాలి.

3. ఇజం: కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాధ్ తీసిన ఇజం పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. ఓపెనింగ్ వీకెండ్ బాగానే రాబట్టినా తర్వాత బాగా స్లో అయిపోయింది. ఈ వీకెండ్ కూడా వసూళ్లు తక్కువగానే రాగా.. మరోవారం పాటు వసూళ్ల స్పీడ్ చూపించగలిగితేనే.. ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

4. ధర్మయోగి: తెలుగు వెర్షన్ శుక్రవారం రిలీజ్ కాలేకపోవడం ధనుష్ ధర్మయోగికి దెబ్బ అని చెప్పాలి. టాక్ బాగానే ఉండడం కాసింత అడ్వాంటేజ్. వీక్ డేస్ లో ఈ మూవీ పుంజుకోవచ్చని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

5. ప్రేమమ్: అక్కినేని నాగచైతన్య మూవీ ప్రేమమ్ వసూళ్లు దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేశాయి. ఇప్పటికే హిట్ అనిపించుకోవడమే కాదు.. అందరికీ లాభాలు కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. కానీ బ్లాక్ బస్టర్ గా నిలిచేందుకు అన్ని ఛాన్సులు ఉన్నా.. రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ ఆపేయడం లాంటివి ప్రభావం చూపించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News