ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న డైరక్టర్ ఎవరు? చాలామందికి డిమాండ్ ఉన్నా కూడా వారు చేయడానికి రెడీగా ఉండరు. రాజమౌళి అండ్ త్రివిక్రమ్ ఈ బాపత్తే. వారు ఎవరితో పడితో వారితో సినిమాలు చేసేయరు. అయితే ఒక దర్శకుడు మాత్రం తనకు ఆఫర్ ఇచ్చిన ప్రతీ నిర్మాతకూ ఓకె చెప్పేస్తూ ఇప్పుడు కమిట్మెంట్లు ఇచ్చిన కిలాడీ రాజా తరహాలో వార్తల్లో వినిపిస్తున్నాడు.
అసలు అతను చేసే సినిమాలు సంగతి గురించి పక్కనపెడితే, ప్రాజెక్ట్ చేస్తానంటూ నిర్మాతలు దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సులు చాలానే ఉన్నాయి. అలాగే మాకో సినిమా చేయమంటూ బలవంతంగా అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఒక యంగ్ హీరోతో సినిమా చేస్తున్న ఈ డైరక్టర్ కు.. ఇది మొదలుపెట్టక ముందే ఒక పెద్ద బ్యానర్ అడ్వాన్స్ అందించింది. ఇటీవలే ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఒకాయన కూడా ఈయనకు అడ్డాన్స్ ఇచ్చాడట. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ కూడా అడ్వాన్స్ ఇచ్చిందట. ఇవి కాకుండా మరో అరడజనుకు పైగా కొత్త నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు టాక్.
చూస్తుంటే మనోడు కంటెంట్ ఎలా రాస్తాడో ఎలా తీస్తాడో తెలియదు కాని.. సినిమా ఆఫర్లను పట్టడంలో మాత్రం తనకు తానే స్పెషల్ అని చెప్పుకోవాలి. ఏదో ఒకటి రెండు ప్రాజెక్టులు లైన్లో ఉండటం.. ఒకరిద్దరి దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం ఓకె కాని.. ఇలా ఇండస్ర్టీ అంతా అతనికి అడ్వాన్సులు ఇవ్వడం ఏంటండీ బాబూ. ఒకవేళ వరుసగా రెండు ఫ్లాపులు వస్తే మాత్రం జనాలు వడ్డీతో సహా అడ్వాన్సులు వెనక్కి తీసుకుంటారు.. జాగ్రత్త నాయనా!!