నిర్మాత‌లు షూటింగులు ఆపాల్సిన ప‌ని లేదు!-ఛాంబ‌ర్

Update: 2022-06-21 17:16 GMT
తెలుగు సినీకార్మిక ఫెడ‌రేష‌న్ షూటింగుల‌ బంద్ కి పిలుపినిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నిర్మాత‌ల గిల్డ్ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశం నుంచి ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు ఇంకా. అయితే రేప‌టి నుంచి షూటింగులు చేసుకోవాలా వ‌ద్దా? అన్న‌దానికి స‌రైన క్లారిటీ లేదు. ఇంత‌లోనే తెలుగు ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడు కొల్లు ర‌వీంద్ర ఆస‌క్తిక‌ర క్లాజ్ గురించి వివ‌రించారు.

15రోజులు ముందుగా నోటీస్ ఇవ్వ‌కుండా కార్మికులు బంద్ కి ఉప‌క్ర‌మించ‌కూడ‌ద‌నేది ఈ క్లాజ్. అలాంట‌ప్పుడు నిర్మాత‌లు రేప‌టి నుంచి య‌థాత‌థంగా షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని ఇది చ‌ట్ట‌బద్ధ‌మేన‌ని కూడా అన్నారు. ఫిలింఫెడ‌రేష‌న్ నుంచి త‌మ‌కు ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని కూడా కొల్లు తెలిపారు. అయితే ఫెడ‌రేష‌న్ మాత్రం షూటింగులను బంద్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇక కార్మికుల నుంచి ఎవ‌రికీ ఎలాంటి స‌హ‌కారం అంద‌దు. భ‌త్యాల పెంపు త‌ర్వాతే తిరిగి విధుల‌కు రావాల‌ని నిర్ణ‌యించారు.

గిల్డ్ స‌మావేశం ఏం తేలుస్తుందో?

మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌లో ఎంతో కీల‌క‌మైన నిర్మాత‌ల గిల్డ్ ప్ర‌స్తుత స‌మ‌స్య‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగిస్తోంది. కార్మికుల డిమాండ్ కి త‌లొగ్గి భ‌త్యాలు పెంచుతారా?  లేక భీష్మిస్తారా? అన్న‌దానికి ఇంకా క్లారిటీ లేదు. దీనిపై నిర్మాతల మండ‌లి  - ఛాంబ‌ర్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ‌తాయో వేచి చూడాలి. ఇంత‌కీ గిల్డ్ పెద్ద‌ల మైండ్ లో ఏం ఆలోచ‌న ఉన్న‌ట్టు?
Tags:    

Similar News