కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు.. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ సెట్ చేయాలంటాడు పవన్ కళ్యాణ్. అయితే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసే దర్శకులు, హీరోలు కొంతమందే ఉంటారు. వారిని మిగతా వారు ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతారు. అయితే అన్నివేళలా అవి సక్సెస్ కాకపోవచ్చు. కానీ మూస ధోరణి మాత్రం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంటుంది.
అప్పట్లో టాలీవుడ్ మొగుడు - అల్లుడు - రౌడీల పేరుతో వరుస సినిమాలు హిట్ అయ్యాయి. అందరూ హీరోలు అలాంటి కథలనే ఫాలో అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రాల ఒరవడి సాగింది. తాజాగా హర్రర్ - సస్సెన్స్ థ్రిల్లర్ ల కథలు హిట్ అవుతున్నాయి. బోల్డ్ - రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కాలానుగుణంగా దర్శకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. విలక్షణమైన కథా కథనం ఉంటే పాత కథ - కొత్త కథా అన్న సంబంధం లేకుండానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి ఒక ట్రెండ్ సెట్టర్. ఈ మూవీతో రాజమౌళి క్రిడెట్ విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడం చూశాక బాలీవుడ్ దర్శకులు ఇలాంటి ప్రయోగమే చేశారు. బాలీవుడ్ అమీర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ కలిసి తీసిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ దారుణ పరాజయం చవిచూసింది. దీని దెబ్బకు ప్రయోగాలు అన్ని వేళాల అదే ధోరణితో సఫలం కాలేవని నిరూపితమైంది.
ఇప్పుడు బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితోనే తెలుగులో చిరంజీవి ‘సైరా’ తో వస్తున్నాడు. ఆ మూవీ ఫలితం ఏంటన్నది ఆసక్తిగా మారింది.
అయితే రాజమౌళి సృష్టించి ట్రెండ్ ‘బాహుబలి’కి పూర్తి ఆపోజిట్ గా ప్రభాస్ చేసిన ప్రయత్నమే ‘సాహో’. పూర్తి యాక్షన్ ఒరియెంటెడ్ - ట్విస్ట్ ల సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. సాహో కనుక హిట్ అయితే దాన్ని బేస్ చేసుకొని మళ్లీ చాలా సినిమాలు వచ్చేయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మళ్లీ బాహుబలి తర్వాత రాజమౌళి వాస్తవిక కథనంతో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథను తెరపై చూపించబోతున్నాడు. అదే ‘ఆర్ ఆర్ ఆర్’. బాహుబలి రాజుల కథ.. ఆర్ ఆర్ ఆర్ స్వాంతంత్ర్యానికి పూర్వం మనలను పాలించిన నియంత పాలకుల కథ.. కంటెంట్ వేరు అయినా కటౌట్లు అవే. మరి ఇలాంటి పాత కథలకు ప్రేక్షకుల తీర్పు ఏంటన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది. రాజమౌళి సృష్టించబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రెండ్ సెట్ చేస్తుందా? బాహుబలి వరుసలోనే ఈ సినిమాపై అభిమానులు బోలెడు ఆశలు పెంచుకున్నారు. పూర్తి భిన్నంగా వెళ్లిన ప్రభాస్ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు అందరికళ్లు ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రయోగం పైనే ఉన్నాయి.