టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు ఊహించని ఫలితాలను అందుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక కంటెంట్ రొటీన్ గా ఉంటే మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా ఆ సినిమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలువడిన ఫలితాలను గమనిస్తే నిర్మాతలకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
ఇక 2022 లో మొత్తంగా అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమాల వివరాల్లోకి వెళితే.. ముందుగా ఎన్నో అంచనాలతో వచ్చిన రాదేశామ్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ను భారీ దెబ్బ కొట్టింది. మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ కు తగ్గట్టుగా చూస్తే దాదాపు 110 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఇక తర్వాత అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాలలో ఆచార్య నిలిచింది.
ఈ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. దీంతో 90 కోట్ల వరకు నష్టాలను చూడాల్సి వచ్చింది. ఆ ప్రభావం డైరెక్టర్ కొరటాల శివ పై కూడా పడిన విషయం తెలిసిందే.
ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా కూడా బయర్లను దారుణంగా ముంచేసింది. ఈ సినిమా మొత్తంగా 62 కోట్ల వరకు నష్టాలను కలిగించింది. రామ్ పోతినేని రొటీన్ కమర్షియల్ మూవీ ది వారియర్ కూడా ఈ ఏడాది అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ది వారియర్ సినిమా మొత్తంగా 18 కోట్ల వరకు నష్టాలను కలుగజేసింది.
అలాగే అక్కినేని హీరోలకు కూడా ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. నాగర్జున నటించిన ది గోస్ట్ సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ అందుకొని దారుణంగా నష్టాలను కలుగజేసింది. ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో కూడా నిలబడలేకపోయింది. దీంతో దాదాపు 17 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
అలాగే మరో అక్కినేని హీరో నాగచైతన్య థాంక్యూ సినిమా కూడా దాదాపు పెట్టిన పెట్టుబడిలో 80% నష్టాలను కలిగించింది. ఈ సినిమా 20 కోట్ల వరకు నష్టాలు కలిగించింది. ఒక విధంగా ఎంతో బిజినెస్ మైండ్ తో ఉండే దిల్ రాజుకు కూడా ఈ ఏడాది అత్యధిక నష్టాలను కలిగించిన సినిమా ఇదే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.