నిప్పు లేనిదే పొగ రాదంటారు.. కానీ నిప్పు లేకున్నా పొగను సృష్టించగలరు మన సోషల్ మీడియాలో నెటిజన్లు.. వార్తల కోసం ఏం చేయడానికైనా.. రూమర్స్ సృష్టించడానికైనా కొందరు వెనుకాడరు.. అయితే ఎలా పుడుతాయో ఎప్పుడు పుడుతాయో కానీ సినీ సెలెబ్రెటీల గాసిప్స్ పై మాత్రం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఎఫైర్లు, చెట్టాపట్టాలు, ప్రేమలు, పెళ్లిళ్లు చేసుకున్నారంటూ సెలెబ్రెటీల జీవితాలపై బోలెడు గాసిప్స్ వస్తూనే ఉంటాయి.
వర్ధమాన హీరోయిన్లందరూ ఏ హీరోతో నటించినా అతడితో ఎఫైర్ ఉందంటూ ప్రచారం వచ్చేస్తుంది.. బాలీవుడ్ లో ఈ సంస్కృతి ఎక్కువ. అక్కడ పెళ్లి కానీ హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కలిసి నటించగానే ఎఫైర్లున్నాయంటూ రూమర్స్ బయటకు వస్తాయి. తెలుగులో ఆ బాధ తక్కువే. ఎందుకంటే 80శాతం మన టాలీవుడ్ అగ్రహీరోలకు పెళ్లిళ్లు అయిపోయాయి. అందుకే వాళ్లతో కలిసి నటించిన హీరోయిన్లుకు ఎఫైర్లు అంటగట్టే సాహసం మనోళ్లు చేయడం లేదు. ఈ లెక్కన పెళ్లైపోయిన మన హీరోలు అదృష్టవంతులనే చెప్పాలి.
టాలీవుడ్ లో పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారంటే అది దేవీశ్రీప్రసాదే.. మొన్నటివరకు ఆయనకు చార్మీతో ఎఫైర్ ఉందని.. ఆమెనే పెళ్లి చేసుకుంటాడని వార్తలు గుప్పుమన్నాయి. దీన్ని వారిద్దరూ ఖండించారు.తాజాగా దేవీ శ్రీ ఓ తెలుగు హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడన్నది ఆ రూమర్ సారాంశం..
దేవీశ్రీతో ప్రేమ మైకంలో ఉన్న ఆ తెలుగు హీరోయిన్ పేరు ‘పూజిత పొన్నాడ’నట.. షార్ట్ ఫిలింలో మెరిసిన ఈమె రంగస్థలంలో ఆదిపినిశెట్టి లవర్ గా అవకాశం దక్కించుకొని నటించి మెప్పించింది. ఆ తర్వాత రంగస్థలం దర్శకుడు సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’సినిమాలో కీలక పాత్ర పోషించింది. తాజాగా వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ సినిమాలో హీరోయిన్ గా చేసింది .
అయితే దేవీశ్రీకి, సుకుమార్ కు దగ్గరి స్నేహబంధం ఉంది.. పూజితను దేవీయే రికమండ్ చేసి సుకుమార్ సినిమాల్లో నటింపచేస్తున్నాడని.. వారిద్దరికి ఎఫైర్ ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై తాజాగా పూజిత పొన్నాడ స్పందించింది..
దేవీశ్రీ సర్ తో నాకు రంగస్థలం 100 డేస్ ఫంక్షన్ లో మాత్రమే పరిచయం అయ్యిందని.. అంతకుముందు తాను దేవీ శ్రీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని పూజిత వివరణ ఇచ్చింది. నాకు, దేవీశ్రీతో సంబంధం ఉందని ఫొటోలు మార్ఫింగ్ చేసి వదిలారని.. ఒకప్పుడు చాలా బాధపడ్డా.. ఇప్పుడు పాపులారిటీ వస్తుందని అలాంటి రూమర్స్ వదిలేశానని చెప్పుకొచ్చింది. ఇలా తనకు దేవీశ్రీకి అస్సలు ఎలాంటి ఎఫైర్ లేదని పూజిత క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలాంటి గాసిప్స్ ను ఎంజాయ్ చేస్తానని.. రియాక్ట్ కానని ట్విస్ట్ ఇచ్చింది.