సినీవినీలాకాశంలో ఏం జరగడానికైనా ఆస్కారం ఉంది. ఇక్కడ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయే ఛాన్సుంది. అదే ఓవర్‌నైట్‌లో కిందికి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. కోట్లాది రూపాయల డీల్స్ నడిచే ఈ రంగుల ప్రపంచం ఆడే వింతాటలో ఎవరైనా పావుగా మారాల్సిందే. అయితే ఈ పేకాటలో ఓటమికి-గెలుపుకి మధ్య ఓ సన్నని లైన్ అడ్డుగా ఉంటుంది. ఆ లైన్ ఏంటో తెలియాలంటే ఈ మ్యాటర్ లోకి డీప్ గా వెళ్లాల్సిందే.
తేజ దర్శకత్వంతో తెరంగేట్రం చేసిన ఓ అందాల తెలుగమ్మాయి ఆ తర్వాత ఓ హారర్ సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. అటుపై టాలీవుడ్లో క్రేజీ నాయికగా పేరు మార్మోగిపోయింది. వరుసగా కొన్ని సినిమాలకు సంతకం చేసింది. మారుతి దర్శకత్వంలోనూ నటించి హిట్ కొట్టింది. ఆ క్రమంలోనే ఎందుకనో తెలుగు సినిమాల్ని కాదని ఓ మలయాళ చిత్రంలోనూ నటించింది. ఎన్టీఆర్ జై లవకుశలోనూ గెస్ట్ అప్పియరెన్స్ తో అదరగొట్టింది. ఆపై మాత్రం ఏమైందో పెద్దంతగా ఇక్కడ కనిపించనేలేదు. సదరు తెలుగమ్మాయ్ ప్రతిభ గురించి వేలు పెట్టి చూపించడానికే లేదు. కానీ ఎందుకనో కెరీర్ పరంగా జీరో అయిపోయింది. ప్రస్తుతం ఓ చిన్న బడ్జెట్ హారర్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా తన కెరీర్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశపడుతోంది. అయితే అసలింతకీ సదరు తెలుగమ్మాయి కెరీర్ ఇలా అవ్వడానికి కారణమేంటి? అంటే ఆ వెనక చాలానే గూడుపుటానీ నడిచిందని ఓ సీనియర్ కోడైరెక్టర్ చెప్పిన వివరాల్ని బట్టి తెలిసింది. ``ఈ అమ్మాయికి క్రమశిక్షణ లేదు. యాటిట్యూడ్ సరిగా ఉండదు. టైముకి ఏనాడూ సెట్స్‌కి వచ్చేది కాదు. ఇలా బ్యాడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడం వల్లనే తన కెరీర్ అలా అయ్యింది`` అని తెలిపారు. అయితే ప్రస్తుతం మాత్రం చేస్తున్న సినిమా సెట్ కి టైమ్ కి ఠంచనుగా వచ్చేస్తోందని, ఇప్పుడు మారిందని అన్నారు. వేరొక కోణంలో చూస్తే, సదరు తెలుగమ్మాయిపై కావాలనే దుష్ప్రచారం సాగించారా? అన్న సందేహాలు తలెత్తక మానవు. ``కమిట్ మెంట్`` లేనిదే అవకాశాలు ఇవ్వని దుర్మార్గులున్న పరిశ్రమ ఇది. ఆ విషయంలో తలొంచకపోవడమే ఈ దుష్ప్రచారానికి కారణం కావొచ్చు కదా!? దుష్టులు నడియాడే చోటు ఇది. దుష్టప్రచారం కాక ఇంకేం ఉంటుంది. ఓ అప్కమ్ కథానాయిక మరీ అంత క్రమశిక్షణ లేకుండా ఉంటుంది అనేస్తే అంత సులువుగా నమ్మేయలేమని సదరు కోడైరెక్టర్ కామెంట్ చేయడాన్ని బట్టి అసలు మ్యాటర్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడర్థమైందా? తెలుగమ్మాయి విధివంచిత ఎందుకైందో?