దసరా జాతర మామూలుగా ఉండదు

Update: 2018-07-15 06:17 GMT
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత కాస్త చెప్పుకోదగ్గ సీజన్ దసరానే. తమిళ్ లో దీపావళిని సినిమాలకు టార్గెట్ చేసుకుంటారు కానీ మనపక్క మాత్రం విజయదశమికే ఎక్కువ సెలవులు వస్తాయి. అందుకే మనవాళ్ళు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టేస్తున్నారు. ఏడాది తర్వాత తన సినిమా లేని గ్యాప్ ని పూడుస్తూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దీనికి తొలి బోణి చేయనున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ పండక్కు ముందుగానే సందడి మొదలుపెట్టనుండగా ఆ తర్వాత లైన్ లో రామ్ హలో గురు ప్రేమ కోసమేతో పాటు విశాల్ పందెం కోడి 2 సిద్ధంగా ఉంటాయి. కానీ అరవింద సమేత వీర రాఘవ అప్పటికే ఎక్కువ థియేటర్లు ఆక్రమించుకుని ఉంటాడు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే కనక తర్వాత వచ్చే వాటికి ఇబ్బంది తప్పదు. ఒక్క ఈ సినిమాకే ఎంత లేదన్నా వంద కోట్ల బిజినెస్ జరుగుతుందన్న అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక అవి ఎంత శాతం పెరుగుతాయో ఊహించుకోవడం కష్టమే. దానికి తోడు ఈ కాంబో మొదటిసారి కాబట్టి అభిమానులు కూడా ఉత్సాహంతో ఉన్నారు.

కానీ పోటీ అనుకున్నంత సింపుల్ అయితే కాదు. థియేటర్ల సంఖ్య పరిమితంగా ఉన్న నేపధ్యంలో ఎవరు ఎన్ని పంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ సినిమా కాబట్టి సమస్య లేదు. ఇక హలో గురు ప్రేమ కోసమే వెనుక ఉంది దిల్ రాజు. తన సినిమానే కాబట్టి విడుదల విషయంలోనే కాదు హైప్ తెచ్చే దాంట్లోనూ రాజీ సమస్య ఉండదు. ఇక అభిమన్యుడుతో తన కం బ్యాక్ సక్సెస్ ఫుల్ గా ఇచ్చిన విశాల్ పందెం కోడి 2 మీద అంచనాలు ఇప్పుడు లేకపోయినా విడుదల సమయానికి మొదలువుతాయి. సో అరవిందకు వెయ్యి హలొ గురు ప్రేమ కోసమేకు ఐదు వందలు పందెం కోడి 2కి ఓ మూడు లేదా నాలుగు వందల స్క్రీన్లు వేసుకున్నా ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలకు ఇబ్బందిగా మారుతుంది. ఇది పసిగట్టే ముందుజాగ్రత్తగా ఒప్పందాలు అగ్రిమెంట్లు లోలోపలే జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంటే అక్టోబర్ లో ఏ థియేటర్ లో ఏ సినిమా రావాలో ఇప్పుడే డిసైడ్ అవుతోందన్న మాట. కథ ఇక్కడితో ఆగిపోలేదు. చిన్నా చితకా అన్ని కలిపి మరో నాలుగైదు సినిమాలు కూడా దసరానే టార్గెట్ చేసుకున్నాయి. మరి ఇవన్నీ ఒక కొలిక్కి రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. తీవ్రమైన పోటీ మాత్రం తప్పేలా లేదు.
Tags:    

Similar News