'వి' మొద‌లు క్యూలో అర‌డ‌జ‌ను రెడీ..!

Update: 2020-08-14 04:00 GMT
ఓటీటీల్లో స‌రైన సినిమా ఏదీ లేక‌ బోరింగ్ ఫీల‌వుతున్నారు. అమెజాన్ ప్రైమ్ స‌హా నెట్ ఫ్లిక్స్ లో జ‌నం హాలీవుడ్ సినిమాలు చూసుకుంటూ .. ఒరిజిన‌ల్ హాలీవుడ్ సిరీస్ ల‌తో టైమ్ పాస్ చేస్తున్నారు. హిందీ సిరీస్ లు తెలుగుకి డ‌బ్ చేసిన‌వి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. ప‌ర‌మ రొటీన్ చెత్త కంటెంట్ ఉన్న తెలుగు సినిమాల‌కు ఆద‌ర‌ణ అక్క‌డ అంతంత మాత్ర‌మేన‌ని ప్రూవైంది. ఇటీవ‌ల రిలీజైన వాటిలో 47 డేస్- కృష్ణ అండ్ హిజ్ లీల- భానుమతి రామకృష్ణ- ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఇవేవీ ఆశించినంత పెద్ద రేంజుకు చేరుకోలేదు. ఉన్న‌వాటిలో కృష్ణ అండ్ హిజ్ లీలా వివాదాల‌తో పాపుల‌రైంది.

అయితే వీటితోనే ఇండ్ల‌లో ఖాళీగా ఉన్న జ‌నాల‌కు వినోదం స‌రిపోతుందా? అంటే అంతా స‌రైన‌ క్రేజీ తెలుగు సినిమా కోసం వెయిటింగ్ తోనే విసిగిపోతున్నారు. ఓవైపు స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ సీజ‌న్ 4ని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ఒక సెక్ష‌న్ జ‌నం వెలితిగానే క‌నిపిస్తున్నారు.

అయితే ఇలాంటి వాళ్లంద‌రికీ ఓ శుభ‌వార్త‌. తొలిగా ఓటీటీలో `వి` సినిమాతో మొద‌లెట్టి వ‌రుస‌గా అర‌డ‌జ‌ను క్రేజీ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు తెలుగు నిర్మాత‌లంతా ఓటీటీతో ఒప్పందాలు చేసుకుంటున్నార‌ట‌. మ‌హ‌మ్మారీ ఇప్ప‌ట్లో ఎలానూ శాంతించ‌ద‌ని క్లారిటి వ‌చ్చేసింది ఇప్ప‌టికే. దీంతో తొలిగా అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజు దిగొచ్చి నానీ-సుధీర్ మ‌ల్టీస్టార‌ర్ `వి`ని ఓటీటికి అమ్మేశార‌ట‌. త్వ‌ర‌లోనే అమెజాన్ లో ఇది రిలీజ్ కానుంది.

ఆ త‌ర్వాత అర‌డ‌జ‌ను రెడీ. అనుష్క - నిశ్శ‌బ్ధం విష‌యంలో కోన ఇప్ప‌టికే క్లారిటీతో ఉన్నార‌ట‌. వైష్ణ‌వ్ తేజ్ - ఉప్పెన .. రామ్ - రెడ్.. ర‌వితేజ - క్రాక్ వంటివి ఓటీటీల్లో వ‌చ్చేందుకు వెసులుబాటు ఉంద‌ని తాజా సీన్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. వీటితో పాటు ప‌లువురి సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయిట‌. స‌రైన రేట్ త‌గిలితే ఓటీటీల‌కు విక్ర‌యించి త‌మ సినిమాల్ని విజ‌యం బాట‌లో న‌డిపించాల‌న్న‌ది ప్లాన్. మాలీవుడ్ కోలీవుడ్ త‌ర‌హాలోనే ఇక‌పై టాలీవుడ్ లోనూ ఓటీటీ విష‌యంలో బెట్టు వీడే నిర్మాత‌ల సంఖ్య పెరుగుతోంది. ఇక‌పై ప్రారంభించే వాటిలో మెజారిటీ పార్ట్ ఓటీటీ సినిమాల‌కే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


Tags:    

Similar News