మన తెలుగులో సినిమాలు వస్తే ఒక్కసారిగా అన్నీ వచ్చి ప్రేక్షకులను ఊపిరి తీసుకోకుండా చేస్తాయి లేకుంటే ఒక్క సినిమా కూడా అందుబాటులో లేకుండా ఉంటాయి. కిందరి వారం కూడా అలానే వచ్చి ప్రేక్షకులను కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఏ సినిమా ముందు చూడలో తెలియక విడుదలైన అన్నీ సినిమాలు ఎలా చూడాలో తెలియక తిరకాసు పడ్డాడు ప్రేక్షకుడు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రానుంది. ఆగష్టు చివరివారంలో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి.
కిందటి వారం నేనే రాజు నేనే మంత్రి - లై - జయ జానకి నాయక అలానే వచ్చి వాటి కలెక్షన్లు పై కొంచెం ప్రభావం చూపింది. కొంచం రెండు మూడు రోజులు గ్యాప్ లో వస్తే ఆ మూడు సినిమాలు మంచి కలెక్షన్లు వచ్చేవి అని అంటున్నారు. ఇప్పుడు కూడా రెండు రోజులలో నాలుగు సినిమాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమా ముందు నుండే ఆగష్టు 25 విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విజయ్ దేవేరకొండ కెరియర్ని మలుపు తిప్పే సినిమాగా మారింది. పెళ్లి చూపులు తరువాత మళ్ళీ అంతటి హిట్ సినిమా ఇవ్వలేకపోయాడు. విజయ్ చేతిలో కొన్ని సినిమాలు ఉన్నకూడా ఈ సినిమా విజయం పొందితే అతనికి మరింత గుర్తింపు వస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా కాకుండా నారా రోహిత్ మరియు నాగ శౌర్య హీరోలుగా నటించిన ‘కథలో రాజకుమారి’ సినిమా కూడా ఆగష్టు 25 న విడుదలవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పటి నుండో విడుదలకావడానికి ఎదురుచూస్తుంది. ఇప్పటికీ ఫిక్స్ చేశారు ఒక తేదిని . ఈ కథలో రాజకుమారి లో ఒక పాటకు ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం.
ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు పోటీకి వస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘వివేకం’ కూడా ఈ రోజునే విడుదలవుతుంది. మరో సినిమా ఏమో ధనుష్ హీరోగా నటించిన ‘విఐపి2’ కూడా వస్తుంది. ధనుష్ కి రఘువరన్ బి.టెక్ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ అజిత్ కుమార్ కి మన తెలుగులో అంతగా ఫాన్స్ లేరనే చెప్పాలి. మరి రెండు తెలుగు సినిమాలు రెండు తమిళ్ సినిమాలు ఒకే సారి విడుదలై ఎటువంటి విజయం దక్కించుకొంటాయో చూడాలి.