మొత్తానికి దసరాకు రావాల్సిన భారీ సినిమా ‘ధృవ’ వాయిదా పడ్డ వార్త నిజమేనని తేలిపోయింది. ‘ధృవ’ రేసులో ఉండగానే రెండు మూడు సినిమాలు పోటీకొచ్చాయి. అలాంటిది ఆ సినిమా పోటీ నుంచి తప్పుకుందనగానే మరిన్ని సినిమాలు రేసులోకి వచ్చాయి. ప్రస్తుతానికి కనీసం ఐదు సినిమాలు అక్టోబరు 7న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో రెండు సినిమాలు కూడా దసరా మీద కన్నేసినట్లు తెలుస్తోంది.
‘దసరా’కు అన్నిటికంటే ముందు ఫిక్స్ అయిన సినిమా ‘ప్రేమమ్’. ‘ధృవ’ పక్కా అనుకున్నపుడు ఈ చిత్రాన్ని అక్టోబరు 8న రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే చరణ్ సినిమా వాయిదా అనగానే ఇది 7కు ఫిక్స్ అయింది. దీంతో పాటు ప్రకాష్ రాజ్ ‘మనఊరి రామాయణం’ కూడా అదే రోజుకు రిలీజ్ డేట్ ఖాయం చేసుకుంది. అభినేత్రి కూడా అదే రోజు తెలుగు - తమిళం - హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. లేటెస్టుగా సునీల్ సినమా ‘ఈడు గోల్డ్ ఎహే’కు కూడా 7న రిలీజ్ అంటూ డేట్ ఇచ్చేశారు.
కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ వీటన్నిటికంటే ఒక రోజు ముందే అక్టోబరు 6న విడదులవుతుంది. దాని గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఐతే ఈ ఐదు సినిమాలకు తోడు ఇజం - హైపర్ కూడా దసరా రేసులో నిలుస్తాయని వార్తలొస్తున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాల్ని సెప్టెంబరు 29 - 30 తేదీల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దసరా అడ్వాంటేజ్ కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా ఆడియో.. ప్రమోషన్ కార్యక్రమాల ఊసే ఎత్తకపోవడం చూస్తుంటే వీళ్లు కూడా దసరా రిలీజ్ మీదే కన్నేశారా అని డౌట్ కొడుతోంది.