నవంబర్ 1: బ్యాడ్ డేట్ కానీ భలే పోటీ!

Update: 2019-10-11 05:57 GMT
సినిమా ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ కు మంచి డేట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈమధ్యకాలంలో సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కీలకంగా మారుతున్నాయి. సరైన డేట్ ఎంచుకోవడం.. ప్రేక్షకులకు చేరేలా ప్రమోషన్స్ చేయడం లాంటివి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి. అయితే ఈమధ్య మన ఫిలిం మేకర్లు బ్యాడ్ రిలీజ్ డేట్లను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నిజానికి టాలీవుడ్ సినిమాలకు నవంబర్ నెల అన్ సీజన్. ఇది కొన్నేళ్ళుగా ట్రేడ్ ను గమనిస్తున్నవారి మాట. అప్పుడే దసరా సీజన్ ముగిసిఉండడంతో ప్రజలు వర్క్ మోడ్ లో ఉంటారు.. స్టూడెంట్స్ కూడా హాలిడేస్ పూర్తయి ఉండడంతో చదువులపై ఫోకస్ చేస్తుంటారు.  అందులోనూ నవంబర్ ఫస్ట్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయడం అంటే చేజేతులా కొరివితో తలగోక్కున్నట్టేననే అభిప్రాయం ఉంది.  అయితే ఈ సారి అన్ సీజన్.. బ్యాడ్ డేట్ అని చెప్తున్న నవంబర్ 1 పై ఫుల్ గా ఫోకస్ చేశారు.  ఈ తారీఖున మూడు విభిన్నమైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతుండడం విశేషం.

ఈ సినిమాల్లో మొదటిది విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా'.  తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా తన అదృష్టం పరిక్షించుకుంటున్నాడు.  రెండో సినిమా రవిబాబు - దిల్ రాజుల 'ఆవిరి'.  ప్రేక్షకులు 'స్పిరిట్' ని కనుక్కునేవరకూ రవిబాబు ఊరుకునేలా లేరు.  మూడవ సినిమా వీటికి భిన్నం.. అడల్టు మోత.. '7 చేపల కథ'.  ఒకటి న్యూ జెన్ బోల్డ్ ఫిలిం.  రెండోది స్పిరిట్ స్టొరీ.. మూడోది బూతు జింతాత.  ఈ మూడు కలిసి బ్యాడ్ డేట్ ను తగులుకున్నాయి. మరి బ్యాడ్ డేట్ నెగెటివిటీ వీటిపై ప్రభావం చూపిస్తుందా లేక ఈ మూడిటి దెబ్బకు బ్యాడ్ డేట్ కాస్తా బెంబేలెత్తి గుడ్ డేట్ గా.. ఫ్యూచర్ లో మంచి సెంటిమెంట్ గా మారుతుందా వేచి చూడాలి.


Tags:    

Similar News