నీ.. టీవీ రంగానికి చెందిన నటులు ఆత్మహత్యలు చేసుకోవటం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది. ఈ మధ్యనే తమిళ సినీ.. టీవీ నటుడు ప్రశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జెమినీ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న నిరోషా అనే యాంకర్ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది.
సికింద్రాబాద్ లోని సింధి కాలనీలో ఉన్న లేడీస్ హాస్టల్ లో ఆమె సూసైడ్ చేసుకుంది. ఏపీలోని చిత్తూరు జిల్లా మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన నిరోషా సూసైడ్ వెనుక.. ప్రేమ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. 23 ఏళ్ల నిరోషా ఆత్మహత్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
మరో నెల రోజుల్లో ఆమె వివాహం జరగాల్సి ఉందని.. ఇప్పటికే ఆమెకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని తెలుస్తోంది. నెల రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో.. ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుంది? ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఆమెకు ఎంగేజ్ మెంట్ కాలేదని.. త్వరలో జరగనుందన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది.
సూసైడ్ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు.