సినిమా తేడా కొడితే అంతే సంగతి!

Update: 2017-08-24 07:52 GMT
సినిమా ఎప్పడో కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో విడుదల అవ్వాలి - కానీ ఇన్ సైడ్ టాక్ మార్కెట్ లోకి లీక్ అవ్వడంతో కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో టీమ్ మొత్తం సినిమా ప్రివ్యూ చూసుకొని మార్పులు చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు దీంతో హీరోనే రంగంలోకి దిగాడు సినిమాను రీషూట్ చేయించి ఓ గట్టేక్కించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సినిమా విడుదలకి రెడీ అయింది. ఎప్పుడో లిప్ కిస్ విడియోని రిలీజ్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ట్రై చేశారు ఆ సినిమా టీమ్. వర్క్ అవుట్ అయింది.

ఆ ట్రీక్ నే మళ్లీ మళ్లీ వాడుకోవడం మొదలుపెట్టారు. టీజర్ లో లిప్ కిస్ ని వాడుకున్నారు - ట్రైలర్ లో కూడా వాడేసారు. చివరకు అదే పోస్టర్లుగా వేసేశారు. ఇక్కడే తేడా కొట్టేసింది - మహిళా సంఘాలు - సామాజికి కార్యక్తలు ఆ సినిమా పై లెక్కకు మంచి కేసులు పెట్టారు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇది కూడా ఓ ప్రచారమే అనే భ్రమలో ఆ సినిమాలు ఇప్పటికీ ఉన్నారనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే సినిమాను చేతుల్లోకి తీసుకున్న హీరో మరోలా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. ఓవర్ నైట్ వచ్చిన స్టార్ డమ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కుర్ర హీరో - అక్కర్లేని సవాళ్లు చేస్తున్నాడు - వివాదాస్పధ వ్యాఖ్యలు చేస్తూ సినిమాకి ప్రచారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇదంతా సినిమా హిట్ అయితే జనాలు మరిచిపోతారు. కానీ సినిమాకు ఏమైనా తేడా కొడితే మాత్రం ఇటు ఆ డైరెక్టర్ అటు ఆ హీరో కెరీర్ బోల్తా కొట్టేయడం ఖాయం అనే డిస్కషన్స్ ఫిల్మ్ ఫోక్స్ మధ్య నడుస్తున్నాయి. ఏదో ఒక్కసారి వచ్చిన హిట్ తో తలెగరేసిన చాలా మంది యంగ్ హీరోలు తెరమరుగైయ్యారనే వాస్తవాల్ని ఆ కొత్త హీరోగారు గుర్తించాలని సినీ జనాలు అంటున్నారు. ఏదిఏమైనా ఇండస్ట్రీ సక్సెస్ చుట్టూనే తిరుగుతుందనే విషయమైతే వాస్తవం. మరి ఈ నేఫథ్యంలో ఆ హీరోగారి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News