భయమెందుకు ఎన్టీఆర్? పట్టించుకోరులే!!

Update: 2017-07-13 08:15 GMT
మనం కొన్ని నిజాలు ఓపెన్ గా ఒరిజినల్ ప్రొఫైల్ పిక్ పెట్టుకుని మాట్టాడుకుంటే.. డెఫినట్ గా సౌత్ లో తెలుగోళ్ళకు మనోభావాలు దెబ్బతినడం అనేది రేర్ గా జరిగే విషయం. అందులోనూ ఒక సినిమా వలనో ఒక టివి షో వలనో మనోళ్ళు హర్టయ్యారు అనే విషయం మనం ఎప్పుడోకాని వినం. ఇప్పటిరవకు కులం బేస్ చేసుకుని వచ్చిన కంప్లయింటులే తప్పించి.. అసలు తెలుగులో ఏ ప్రోగ్రామ్ పై ఎవ్వరూ సీరియస్ అయ్యిందే లేదు.

ఇప్పుడీ చాట భారతం అంతా ఎందుకంటే.. ''బిగ్ బాస్'' తమిళ్ వెర్షన్ పై అక్కడి సంస్థ ఒకటి నిప్పులు చెరిగి కమల్ హాసన్ ను అరెస్టు చేయాలంటూ పిలిపునిస్తోంది. నానా రచ్చా చేస్తోంది. ఇదంతా చూసి ఇక్కడ ఎన్టీఆర్ అండ్ కో చాలా టెన్షన్ పడుతున్నారట. బిగ్ బాస్ షోలో అసలే చాలా కొట్లాటలూ ప్రేమించడాలూ రొమాన్సులూ ఇతర ఫైటింగులూ ఉంటాయి కాబట్టి.. మనోళ్ళు అదంతా ఎలా తీసుకుంటారోనని ఈ షో తెలుగు వర్షన్ నిర్వాహకులు కంగారుపడుతున్నారట. ఇప్పుడే మనం నిజం చెప్పుకోవాలి. ఒక టివి షోలో కామెడీ పేరుతో ఆడాళ్ళను రబ్బర్ బాల్ ను గోడకేసి కొట్టినట్లు చూపిస్తుంటేనే పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. సినిమాల్లో బూతు డైలాగులను కాలికి సాక్స్ వేసినట్లు కవర్ చేసి వినిపిస్తేనే సీరియస్ గా తీసుకోని మన తెలుగు ప్రేక్షకులు ఈ 'బిగ్ బాస్' లో ఉండే రచ్చను పట్టించుకుంటారా? అబ్బే పట్టించుకోరులే అంటున్నారు సినిమా లవర్స్.

ఒకవేళ నిజంగా ప్రోగ్రామ్ లో ఏదన్నా తప్పులు దొర్లినా కూడా.. అది కవర్ చేయడానికి ఫ్యాన్స్ ఉంటారు.. పర్లేదులే అనడానికి పెద్దలూ ఉంటారు.. ఇప్పటివరకు తెలుగులో ఎటువంటి సంస్థ ఎటువంటి ప్రోగ్రామ్ పై కేసులు పెట్టిందని? పెట్టినా కూడా అవన్నీ కేవలం మీడియాలో ఒక సెంటిమీటర్ లెక్కన కవరయ్యే వార్తలే తప్పించి.. కోర్టులకెళ్ళి హక్కులు సాధించే రేంజులో ఏనాడూ ఏం జరిగిందే లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు.
Tags:    

Similar News