సాంగ్ ప్రోమో : స‌ల్మాన్ తో మెగా తారా మార్ త‌క్క‌ర్‌మార్‌!

Update: 2022-09-13 13:23 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. మూడు ప్రాజెక్ట్ లు ప్ర‌స్తుతం సెట్స్ పై వున్నాయి. అందులో మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న మూవీ `గాడ్ ఫాద‌ర్‌`. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఈ మూవీని ఎన్వీ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ‌స్ట్ టైమ్ గ్యాంగ్ స్ట‌ర్ గా సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార, సత్య‌దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీని ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అక్టోబ‌ర్ 5న ఈ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మెగాస్టార్ ఎలాంటి హీరోయిన్ లేకుండా ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీలో న‌టిస్తున్నారు.

సినిమా రిలీజ్ కు మ‌రో 20 రోజులు మాత్ర‌మే వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మంగ‌ళ‌వారం నుంచి అగ్రెసీవ్ గా ప్రారంభిస్తోంది. సినిమాలో చిరుకు జోడీ అంటూ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో మెగాస్టార్ నుంచి మెస్మ‌రైజ్ చేసే డ్యాన్స్ నంబ‌ర్ లు వుండ‌వా? అంటే తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్న అభిమానుల కోసం బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌, మెగాస్టార్ చిరంజీవిపై ప్ర‌త్యేకంగా ఓ స్పెష‌ల్ సాంగ్ ని షూట్ చేసి విష‌యం తెలిసిందే.

ముంబైలోని ఎన్టీ స్టూడియోస్ లో ప్ర‌త్యేకంగా వేసిన భారీ సెట్ లో స‌ల్మాన్ ఖాన్‌, మెగాస్టార్ చిరంజీవిపై ఈ పాట‌ని చిత్రీక‌రించారు. ఈ ప్ర‌త్యేక డ్యాన్స్ నంబ‌ర్ కు ఇండియ‌న్ మైఖేల్ జాక్సన్‌, డాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవా డాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోని మంగ‌ళ‌వారం సాయంత్రం 6:06 నిమిషాల‌కు రిలీజ్ చేశారు. అంత‌కు ముందే చిన్న వీడియో క్లిప్ ని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్  మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

స్టెప్స్ వేయ‌డానికి రెడీగా వుండండి అంటూ స‌ద‌రు వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. అనంత‌శ్రీ‌రామ్ రాసిన `తార్ మార్ త‌క్క‌ర్ మార్` అంటూ సాగే ఈ పాట‌కు త‌మ‌న్ సంగీతం అందించ‌గా చిరు, స‌ల్మాన్ క‌లిసి పాట‌కు త‌గ్గ‌ట్టే తార్ మార్ త‌క్క‌ర్ మార్ చేయబోతున్నారు. ఫుల్ సాంగ్ ని సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ పాట‌లో ఇద్ద‌రు స్టార్స్  త‌మ‌దైన స్టెప్పుల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డం కాయంగా క‌నిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News