టైటిల్ ఎంత క్రియేటివ్ గా ఉంటే అంతగా ఆకర్షిస్తుంది. ఈ విషయంలో మన దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల చాలా సినిమాల టైటిల్స్ యూత్ ని ఆకర్షించడంలో సక్సెసయ్యాయి. టైటిల్ ఆకర్షణ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ని ప్రభావంతం చేసేయకపోయినా.. కొంతవరకూ కలిసొస్తోంది. అదే కోవలో తాజాగా వస్తున్న సినిమా `తాగితే తందానా`. ఆదిత్- సప్తగిరి- మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై వి.మహేష్- వినోద్ జంగపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రాన్ గుప్తా- రియా నాయికలు. పాట.. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది.
తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో ఆకట్టుకుంది. ముగ్గురు అమాయకుల్ని లోనేశారా? అసలింతకీ ఏం నేరం చేశారు? టైటిల్ లో చెప్పినట్టే తాగి తందనాలు ఆడి ఇలా చిక్కారా? అసలేం జరిగింది? అన్నట్టు పిస్తోల్ పట్టుకుని జులుం చూపిస్తున్నది ఎవరు? మఫ్టీలో ఉన్న పోలీసాఫీసరా? ఇంతకీ ఆడ పోలీసా.. మగ పోలీసా? ఇన్ని సందేహాలు కలుగుతున్నాయి ఈ పోస్టర్ చూస్తుంటే. ఆ పిస్తోలు పట్టుకున్నది మనిషి ఎవరు? అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ముగ్గురు కమెడియన్లను ఎంచుకున్నారు కాబట్టి ఇది ఫన్ రైడ్ అనడంలో సందేహం లేదు.
కమేడియన్ గా ఫుల్ లెంగ్త్ పాత్రలు చేస్తుండడం ఆసక్తికరమే. ఈ జోనర్ సినిమాలు ఇటీవల పెరిగాయి. ఇక కథ సినిమాతో పరిచయమైన ఆదిత్ తన కెరీర్ 17వ చిత్రం అని తెలుస్తోంది. ఇందులో అన్ని టైటిల్స్ బాగానే కుదిరాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇక సప్తగిరి అయితే ఈ కథ విని ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించేశాడట. మధు కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ``మా కథకి యాప్ట్ టైటిల్ ఇది. తాగి తందానాలు ఆడితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఒక ముగ్గురు కుర్రాళ్లు తాగి ఆ మత్తులో ఒక సమస్యలో ఇరుకుంటారు.. దానినుండి ఎలా బయటపడ్డారనేది కాన్సెప్ట్. చాలా ఫన్నీగా ఉంటుంది`` అని దర్శకుడు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. రైట్ టర్న్ అని బ్యానర్ కి పేరు పెట్టుకున్నారు. మరి ఆ టర్న్ వస్తుందంటారా?