ఓటు హక్కు ఉన్నా ఎప్పుడూ ఓటు వేయడానికి ప్రముఖులు తరలిరారు. సినీ ప్రముఖులు అయితే అసలు ఓటు వేసేది చాలా తక్కువ. అయితే ఈ స్టార్ హీరో మాత్రం తన నిబద్దతను నిరూపించుకున్నారు.
ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఓటు వేయడానికి తలపతి విజయ్ వచ్చారు. ఆయన రాకతో ప్రజలు ఆయనను చూడడానికి పోటెత్తారు. విజయ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటు వేయడానికి రావడంతో దీనికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పలువురు విజయ్ ను ప్రశంసించారు. విజయ్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు భారీగా ప్రజలు మరియు మీడియా అతనిని గుమిగూడి, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించింది.
అది గమనించిన విజయ్ వెంటనే జనాల చుట్టూ నిలబడి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. మరోసారి, తన చర్యతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. విజయ్ చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విజయ్ ఓటు వేస్తున్నప్పుడు ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. విజయ్ జీన్స్ -మాస్క్‌తో గోధుమ రంగు చొక్కా ధరించి సాదాసీదాగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా విజయ్ సింప్లిసిటీకి సంబంధించిన పలు ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. తాజా నివేదికల ప్రకారం.. కొంతమంది దళపతి అభిమానులు కూడా సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అభిమానుల క్లబ్ అసోసియేషన్ అయిన తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ (TVMI) జెండా మరియు పేరును ఉపయోగించడానికి హీరో విజయ్ అనుమతిని కోరారు.ఆయన అంగీకరించడంతో వారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం, విజయ్ తండ్రి , ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా మరియు తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే, విజయ్ తన పేరును రాజకీయ అజెండాలో ఉపయోగించుకున్నందుకు తన తల్లిదండ్రులపై కేసు పెట్టాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తలపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డేతో కలిసి తన తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ అరబిక్ కుతు చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

His Simplicity