సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న #SSMB28 నిరంతరం ఏదో ఒక వార్తతో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా 2023లో విడుదల అవుతుంది.
కానీ ఇంతలోనే ఈ మూవీ గురించి రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో షికార్ చేస్తున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్చేశాడని అలాగే సంగీత దర్శకుడు కూడా మారాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
నిజానికి #SSMB28కి సంగీతాన్ని సమకూర్చడానికి SS థమన్ ని ఎంపిక చేసారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుండి అతడు తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. #SSMB28కి సంగీతం అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేస్తారని.. ఎస్.ఎస్ థమన్ స్థానంలో అతడు ఎంపికయ్యారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది నిజమా? అంటే దానికి అదిరిపోయే కౌంటర్ వేసాడు థమన్.
నిజానికి థమన్ స్థానంలో అనిరుధ్ ని తీసుకున్నట్లు అధికారిక ధృవీకరణ లేదు. ఇంతలోనే #SSMB28 నుంచి థమన్ వైదొలగలేదని నిర్మాతలే క్లారిటీనిచ్చారు. 22 నవంబర్ థమన్ బర్త్ డే సందర్భంగా నిర్మాత నాగవంశీ విషెష్ తెలియజేస్తూ మహేష్ 28 కి ఇచ్చే మార్వలెస్ ట్యూన్స్ కోసం ఎదురు చూస్తున్నామని ఆసక్తిని వ్యక్తం చేసారు.
అయితే దీనికి ప్రతిస్పందిస్తూ కచ్చితంగా మహేష్ సినిమాకి అదరగొడదామని థమన్ పిడికిలి బిగించిన ఈమోజీతో కన్ఫామ్ చేసేసాడు. తన నిర్మాతలపై లవ్ ఈమోజీని సంధించాడు. దీంతో సంగీత దర్శకుడి మార్పుపై వచ్చినవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చినట్టయింది.
నిజానికి చాలా కాలంగా థమన్ సంగీతంపై నెటిజనుల్లో రకరకాల కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అతడు కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని చాలా కామెంట్లు వినిపించాయి. కానీ అన్నిటికీ `అల వైకుంఠపురములో` రూపంలో సమాధానమిచ్చాడు. చార్ట్ బస్టర్ ఆల్బమ్ తో ప్రాక్టికల్ గా జవాబిచ్చాడు. ఇప్పుడు తనను మహేష్ మూవీ నుంచి తీసేశారని వచ్చిన కథనాలపైనా అతడు స్పందించిన తీరు అలానే ఉంది. ప్రతిసారీ తనపై కౌంటర్లకు ఇలా చెక్ పెట్టడం థమన్ కే చెల్లింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.