బ్రూస్ లీ కోసం న్యూయార్క్‌ లో..!

Update: 2015-09-24 06:27 GMT
 కృష్ణాన‌గ‌ర్‌ - ఫిలింన‌గ‌ర్ గ‌ళ్లీల్లో ఉండే రికార్డింగ్ థియేట‌ర్ల‌లో రికార్డింగ్ చేస్తే ఒక ర‌కంగా.... అమెరికా మ‌న్ హ‌ట‌న్ (న్యూయార్క్‌) రికార్డింగ్ స్టూడియోలో రికార్డింగ్ చేస్తే ఇంకో ర‌కంగా మ్యూజిక్ ఉంటుందా? .. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అడిగితే ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయినా ఒక‌టే మాట చెబుతారు. ఎంత చెట్టుకు అంత గాలి. అమెరికా లాంటి చోట టెక్నాల‌జీ అడ్వాన్స్‌డ్‌ గా ఉంటుంది. పైగా టాప్ టెక్నీషియ‌న్స్ అందుబాటులో ఉంటారు. వాయిద్య‌ ప‌రిక‌రాలు మ‌న‌కంటే ఎక్కువ టెక్నాల‌జీతో ఉంటాయి. అందువ‌ల్ల వ‌చ్చే ప్రొడ‌క్ట్ కూడా కొత్త‌గా ఉంటుంది. సౌండింగ్ క్వాలిటీలో డ‌బుల్ వేరియేష‌న్ ఉంటుంది. ఖ‌ర్చు కూడా అంతే ఉంటుంది.. అని చెబుతారు. అందుకే త‌మ‌న్ ఇప్పుడు బ్రూస్ లీ కోసం మ‌న్ హ‌ట్ట‌న్ వెళ్లాడు. అక్క‌డ ఓ ఇద్ద‌రు టాప్ సౌండ్ ఇంజినీర్స్‌ తో క‌లిసి ఈ సినిమాకి సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

త‌మ‌న్ మ్యూజిక్‌ పై ఇప్ప‌టికే బోలెడ‌న్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. అత‌డు ప‌ర‌మ రొటీన్ బోరింగ్ మ్యూజిక్ ఇస్తున్నాడ‌ని, రిపీట్ మ్యూజిక్‌ తో స‌రిపెట్టేస్తున్నాడ‌ని, కాపీ క్యాట్ ట్యూన్ ల‌తో విసిగిస్తున్నాడ‌ని క్రిటిక్స్ విమ‌ర్శిస్తున్నారు. అయితే బ్రూస్ లీ విష‌యంలో త‌మ‌న్ ఆ కామెంట్లు రాకుండా చూసుకోవాల‌ని త‌పిస్తున్నాడుట‌. అందుకే ఇలా అమెరికా వెళ్లి ఈ సినిమా కోసం కొత్త సౌండింగ్‌ ని క‌నిపెడుతున్నాడ‌ని తెలుస్తోంది. మంచిదే .. క్రియేటివిటీ అనేది బుర్ర‌లో ఉంటే స‌రిపోదు. ఆ క్రియేటివిటీని బైటికి తీయ‌డానికి స‌రిప‌డే సాంకేతిక‌త కూడా కావాలి మ‌రి. బ్రూస్ లీ కో్సం త‌మ‌న్ శ్ర‌మ ఫ‌లించాల‌నే కో రుకుందాం. అక్టోబ‌ర్ 2న ఈ సినిమా ఆడియో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News