ఇంటర్యూ: చ‌ర‌ణ్‌ కి మ్యూజిక్ అంటే...

Update: 2015-10-02 22:30 GMT
యంగ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ కెరీర్‌ లో 60 సినిమాల‌కు ప‌నిచేశాడు. లేటెస్టుగా బ్రూస్ లీ ఆడియోతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఓవ‌రాల్ కెరీర్ గురించి త‌మ‌న్ చెప్పిన సంగ‌తులివి....

= . బ్రూస్‌ లీ వెరీ మ‌స్కుల‌ర్ ఆల్బ‌మ్‌. ట్రెండీ. క‌మ‌ర్షియ‌ల్ ఆల్బ‌మ్‌ లో ట్రెండీ. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌, లే చ‌లో మెలోడీ... మాస్ సాంగ్స్ - రియా సాంగ్ .. వీట‌న్నిటికీ మంచి పేరొస్తుంది. అంతేకాదు చ‌ర‌ణ్‌ కి కంపోజ్ చేస్తే ఆయ‌న‌కి మాత్ర‌మే కాదు.. మ‌న‌సులో చిరంజీవి గారిని పెట్టుకోవాలి. అందుకే మ‌రింత మంచి పాట‌లు వ‌చ్చాయ‌ని అనుకుంటున్నా.

=డిక్టేట‌ర్ లోనూ ఛాలెంజింగ్ మ్యూజిక్ చేస్తున్నా. ఇంటెన్స్ ఫిలిం అది. టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే. ఈ సినిమా కో్సం చాలా క‌ష్టించాం. టీజ‌ర్ రిలీజ్ చేశాం. గ‌ణేషా సాంగ్‌ కి మంచి పేరొచ్చింది.

= నా సంగీతంపై విమ‌ర్శ‌లొస్తున్నాయి. సాంగ్ కాపీ చేశానంటే జ‌నాలు ఒప్పుకుంటారా? అమ్మ అన్నం పెడుతుందా? ఆరులో 5 పాట‌లు హిట్ట‌యితే .. ఎలా కాపీ అని అంటారు? ట‌్విట్ట‌ర్‌ లో నా ఫోటో వేసి తిడ‌తారు. అమ్మ నాకు అన్నం పెట్ట‌దు. ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ టిక్కెట్లు తిన్న‌ది నేనేనేమో.. ఫ్ల‌యిట్ టిక్కెట్ ఇచ్చి .. అబ్రాడ్ వెళ్లి అక్క‌డ ట్యూన్

= 8వ సంవ‌త్స‌రంలో భైర‌వ‌ద్వీపంకి ప‌నిచేశా. హ‌లోబ్ర‌ద‌ర్ సినిమాకి కంపోజ్ చేశా. 20 రూపాయ‌లు జీతం ఇచ్చేవారు. నాన్న‌గారు మ్యూజిక్ షోస్‌ లో తిప్పేవారు. త‌మిళ్‌లో ఓ ఆర్కెస్ర్టా ట్రూప్‌ లో 10 ఏళ్ల వ‌య‌సులో చేరాను. రోజా అప్పుడే రిలీజైంది. ఆ షోస్‌ లో చిన్ని చిన్ని ఆశ వంటి కంపోజింగ్స్ చేసేవాడిని. పాడేవాడిని. వాటికి మంచి స్పంద‌న వ‌చ్చేది.

=స్ట‌డీస్‌ లో 100  కి 35 వ‌స్తే గొప్పే. ఆ 35కే ఎంతో క‌ష్ట‌ప‌డేవాడిని. నా టీచ‌ర్స్ ఎలా అయినా వీడిని పాస్ చేయించాల‌ని క‌ష్ట‌ప‌డేవారు. మ్యూజిక‌ల్‌ గా స్కూల్‌ కి బాగా ప‌ని చేసేవాడిని. అందువ‌ల్ల నా టీచ‌ర్స్ పాస్ చేయించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డేవారు. ఆ టైమ్‌ లో  సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాడిని. హాబీగా ఉండేది.

= ప‌రిశ్ర‌మ‌లో 14 ఏళ్ల‌య్యింది. ప్రారంభం బాలు గారితో క‌లిసి ప‌నిచేశా. ఇళ‌య‌రాజా గారి స‌న్, దేవీశ్రీ‌ప్ర‌సాద్‌, ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్‌, వెంక‌ట్ ప్ర‌భు ..వీళ్ల టీమ్ అంతా ఉండేది. 1997-98 టైమ్‌ లో స్టేజీ షోల‌తో అద‌ర‌గొట్టేసేవాడిని. టైమ్ చాలా ఫ‌న్నీగా ఉండేది. మ‌న ఏజ్ వారితోనే ప‌నిచేసేవాడిని. అందువ‌ల్ల ఒత్తిడి ఉండేది కాదు.

=హ‌లో బ్ర‌ద‌ర్ టైమ్ నుంచే రికార్డింగ్ థియేట‌ర్ అంటే ఏమిటో చూశాను. కాల‌క్ర‌మంలో కీర‌వాణితో ప‌నిచేశా. అన్న‌మ‌య్య‌ - చ‌క్రి - వందేమాత‌రం -ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌ - దిన త‌దిత‌రుల‌తో ప‌నిచేశాను. 15 మంది సంగీత ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేశా. త‌ర్వాత బోయ్స్ సినిమాకి ఏ.ఆర్‌.రెహ‌మాన్ గారితో క‌లిసి ప‌నిచేశాను. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. అమ్మ అంటుండేది. నీలో ఏదో ప్రొఫెస‌న్  ఛేంజ్ ఉంది. పెద్ద‌గా ఎదుగుతుంది.. అనేది.

=6 అంత‌స్తులు ఎక్కేవాడిని. లిఫ్ట్ ప‌నిచేయ‌దు. మ‌ధ్య‌లోనే ఆగిపోతుంది. మ్యూజిక్‌ప్లేయ‌ర్ అవుతావ్‌. న‌టుడ‌వుతావ్ .. ట్రై చెయ్ అనేది అమ్మ‌. అయితే ఆ క్ర‌మంలోనే శంక‌ర్ గారితో బోయ్స్‌ కి ప‌నిచేశా. 1.5 సంవ‌త్స‌రాలు ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేశాను. ఆ టైమ్‌ లో  రెహ‌మాన్‌ గారు - ర‌విచంద్ర‌న్‌ - సాబు శిరిల్ వంటి టెక్నీషియ‌న్స్‌తో ప‌నిచేశా. బోయ్స్‌ లో డ్ర‌మ్స్ వాయించా. శివ‌మ‌ణి మా నాన్న శిష్యుడు. అందువ‌ల్ల నేను ఆయ‌న డ్ర‌మ్స్‌ ని ఇమ్మిటేట్ చేసేవాడిని. బోయ్స్ టైమ్‌ లో డ్ర‌మ్స్ వాయించిన ప‌ద్ధ‌తి చూసి శంక‌ర్ అవ‌కాశం ఇచ్చా. ఐదుగురు బోయ్స్‌ లో అంద‌రికంటే ఎక్కువ పే చేశారు నాకు. సిద్ధార్థ్ హీరో అయినా మామ‌ధ్య ఈగోలు ఉండేవి. అప్ప‌టి ఐదుగురు బోయ్స్ ట‌చ్‌ లో ఉన్నాం.

=శంక‌ర్‌ గారు ఒకెత్తు. అలాగే మ‌ణిర‌త్నం గారు ఇంకో్ ఎత్తు. వీళ్ల వ‌ల్లే నా జీవితంలో మార్పొచ్చింది. అవ‌కాశాలొచ్చాయ్‌. మ‌ణిర‌త్నం గారితో ఏనిమిదేళ్ల‌లో 94 సినిమాల‌కు ప‌నిచేశా.

= త‌మిళ్‌ లో ఈరం, తెలుగులో కిక్ ఒకేసారి మొద‌ల‌య్యాయి. కిక్ ముందు రిలీజైంది. త‌ర్వాత ఈరం రిలీజైంది. త‌మిళ చిత్రం తెలుగులో రిలీజై బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. త‌మిళ్‌ లో యావ‌రేజ్‌. రెండు సినిమాలు పెద్ద విజ‌యాలు వ‌చ్చాయి. ఇక్క‌డ రాకెట్‌ లా కెరీర్ ఎదిగింది. పూరి - ర‌వితేజ‌తో చ‌క్రి క‌ల‌యిక‌లో ప‌నిచేశాను. అప్పుడే ర‌వితేజ నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా ఛాన్సిస్తాన‌నేవారు.

=  పోకిరి త‌ర్వాత పూరి అవ‌కాశం ఇచ్చారు. బుజ్జిగాడు చిత్రానికి కానీ పోకిరితో హిట్ కొట్టిన మ‌ణిగారి ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తే మ‌ణి స‌ర్ ఏమైనా అనుకుంటారా? అనుకున్నా. అందుకే ఆ సినిమాకి ప‌ని చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా. ఆ క్ర‌మంలోనే కిక్ చేశాను.
Tags:    

Similar News