పడేశావే పడేశావే.. నీ మైకంలో నను పడేశావే అంటూ.. అఖిల్ మూవీలో ఓ మెలోడీ ఉంది. సినిమాలో ఉన్న పాటలన్నిటిలోకి ఈ మెలోడీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్నిపాటలు బాగున్నా.. ఇది మెలోడీ కావడంతో జనాల నోళ్లలో.. ముఖ్యంగా అమ్మాయిల చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది.
పడేశావే సాంగ్ ను తమన్ కంపోజ్ చేయడం విశేషం. ముందు అన్నిపాటలకు అనుకున్నా.. తర్వాత తమన్ తో పాటు అనూప్ రూబెన్స్ కూడా అఖిల్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. దీంతో తాను ఇచ్చిన ఒకేపాటకు ఇరగదీసేశాడు తమన్. ఈ సంగీత దర్శకుడి నుంచి ఇంత క్యూట్ సాంగ్ రావడం, అది కూడా కంప్లీట్ క్యాచీగా ఉండడం గమనించాలి. మరోవైపు పిక్చరైజేషన్ కూడా పడేసావే సాంగ్ కు ప్లస్ అయింది. పాట తీసిన లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అఖిల్ రఫ్ లుక్స్, సాయేషా క్యూట్ నెస్ పడేశావే సాంగ్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాయి. ఫ్యాన్స్ నుంచి కూడా ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అసులు సినిమాకే ఈ సాంగ్ హైలైట్ అంటున్నారంటే.. పడేశావే అనేపాట అభిమానులను ఎంతగా పడేసిందో అర్దమవుతుంది.
మేబీ మిగిలిన పాటలన్నీ కాస్త ఫాస్టు బీట్స్ కావడం.. ఈ పాట ఒక్కటే కాస్త మెలోడీలా స్లోగా ఉండటం కూడా ఒక విధంగా ప్లస్సేనేమో. కాకపోతే నాలుగు పాటలు కంపోజ్ చేసిన అనూప్ కంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ కంటే.. థమన్ కే పేరు రావడం విశేషం.