థమన్ చెప్పి మరి సిక్స్ లు కొట్టాడట..!

Update: 2023-01-19 03:30 GMT
వంశీ పడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా వరిసు. తెలుగులో వారసుడిగా సంక్రాంతి కానుకగా రిలీజైంది. తెలుగులో సినిమా రొటీన్ టాక్ తెచ్చుకున్నా తమిళ్ లో మాత్రం సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కోలీవుడ్ లో విజయ్ సినిమా హిట్ అయిందా లేదా అని కాదు వసూళ్లు 200 కోట్లు దాటాయా లేవా అని అడగాలని ఫ్యాన్స్ అన్నట్టుగా వారిసు అక్కడ సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

ఈ సినిమాతో దిల్ రాజు తమిళ్ లో కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా డెబ్యూ ఇచ్చారు. సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా మారింది. కెరీర్ లో ఫస్ట్ టైం థమన్ విజయ్ తో సినిమా చేశాడు. అందుకే ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేసినప్పుడే ప్రతి సందర్భం డైరెక్టర్ వంశీ చెప్పడం.. థమన్ ట్యూన్ ఇవ్వడం జరిగిందట.

అంతేకాదు ముందే చెప్పి మరి ఈ సినిమాకు ఆరు సిక్స్ లు ఇస్తానని చెప్పి మరి సూపర్ మ్యూజిక్ అందించాడు థమన్. ఇలా చెప్పి హిట్ సాంగ్స్ ఇస్తే వచ్చే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఈ సంక్రాంతికి థమన్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. క్లాస్ సినిమాగా వారసుడు వస్తే.. ఊర మాస్ సినిమాగా వీర సింహా రెడ్డి వచ్చింది. బాలయ్య సినిమాకు మరోసారి థమన్ మార్క్ మ్యూజిక్ తో సౌండ్ అదిరిపోయేలా చేశాడు.

ఈమధ్య థమన్ ప్రతి సినిమాకు ఫుల్ ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో థమన్ ని కొట్టేవాడే లేడు అన్నట్టుగా సత్తా చాటుతున్నాడు. థమన్ ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం ఇంకొన్ని సెన్సేషనల్ సాంగ్స్ ఆడియన్స్ కి ఇస్తాడని చెప్పొచ్చు. వారసుడు, వీర సిం హా రెడ్డి రెండు సినిమాల సక్సెస్ లలో థమన్ తన మార్క్ చూపించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News