ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ థమన్. గత రెండేళ్లుగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న సంగీత దర్శకుడు.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. భాషతో సంబంధం లేకుండా నిర్విరామంగా పని చేస్తున్నాడు.
థమన్ సంగీతం సమకూరుస్తున్న భారీ చిత్రాల్లో RC15 కూడా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అనౌన్స్ మెంట్ రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
శంకర్ సినిమాలో పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయనే సంగతి తెలిసిందే. ఈసారి ఆయన కోసం థమన్ అద్భుతమైన పాటలు సమకూరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రీ రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవల్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
శంకర్-చరణ్ సినిమాలో 7 పాటలు ఉంటాయని థమన్ ఇప్పటికే దృవీకరించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో థమన్ #RC15 సినిమాలో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడారు. ఈ ఆల్బమ్ విభిన్నంగా ఉంటుందని.. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.
థమన్ మాట్లాడుతూ.. "శంకర్ గారి సినిమా స్పాన్ వేరు. పాత బ్రెయిన్స్ అన్నీ పక్కనపెట్టి ఇంకో బ్రెయిన్ తో వర్క్ చేయాలి. టెక్నీషియన్లు వివిధ పనుల కోసం హార్డ్ డిస్కులు మార్చినట్లుగా.. నేను ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు నా హార్డ్ డిస్క్ (బ్రెయిన్) ని మార్చుకుంటాను. శంకర్-చరణ్ సినిమా వేరే వరల్డ్. పాటలు రిలీజ్ అయినప్పుడు అది మీకే తెలుస్తుంది" అని చెప్పుకొచ్చారు.
శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్' సినిమాతో థమన్ నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అగ్ర దర్శకుడి చిత్రానికి సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు తమన్. అందులోనూ ఇది శంకర్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం.
అందుకే థమన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. మిగతా ప్రాజెక్ట్స్ కంటే కాస్త ఎక్కువ ఎఫెర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. RC15 చిత్రాన్ని 2023లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా 40 నిమిషాల షూటింగ్ పెండింగ్ ఉండగా.. 4 షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
RC15 సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండగా.. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.