దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ హవా కొనసాగుతోంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో వరుసగా క్రేజీ మూవీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీస్తున్నాడు. అయితే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నా థమన్ మీద 'కాపీ క్యాట్' అనే ముద్ర మాత్రం పోవడం లేదు. థమన్ కంపోజ్ చేసే ప్రతి ట్యూన్ ఒరిజినల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మామూలు అయిపోయింది. 'కింగ్' సినిమాలో పక్క భాషల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇచ్చే బ్రహ్మానందం ఫోటోలతో మీమ్స్ చేసి మరీ కామెంట్స్ చేస్తుంటారు. తమన్ పెద్ద కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో జరిగే రచ్చపై తమన్ కూడా అప్పుడప్పుడూ స్పందిస్తుంటాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను కాపీ ట్యూన్స్ ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అంటూ థమన్ అన్న మాటలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు 'క్రాక్' ఆల్బమ్ మారు మ్రోగుతున్న నేపథ్యంలో థమన్ మరోసారి మీమర్స్ ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు. దీంతో మరోసారి కాపీ క్యాట్ ట్రోల్స్ పై థమన్ స్పందించాడని తెలుస్తోంది. 'దమ్ముంటే కొత్తగా వాళ్ళను ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి.. ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఎవడూ వినేవాడు లేడు' అంటూ థమన్ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా 'ఒక సాంగ్ రిలీజ్ చేసే ముందు అందరూ వింటారు.. ఆడియో కంపెనీలు, లిరిక్ రైటర్లు, తనతో పనిచేసే వాళ్లు అంతా వింటారు.. వాళ్లందరికీ నచ్చే పాట కాపీ అయితే వాళ్లకు తెలియదంటారా' అంటూ థమన్ ప్రశ్నిస్తున్నాడు. 'నిజంగా కాపీ కొడితే దర్శక నిర్మాతలకి తన ముఖం ఎలా చూపిస్తాను.. రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు నువ్వెందుకు కాపీ కొట్టావని నన్ను అడుగుతారు కదా.. అయినా పనిలేని కొందరు చేసే కామెంట్స్ పట్టించుకుంటూ కూర్చుంటే తన పని ఆగిపోతుంది కదా' అంటూ విమర్శకుల ట్రోల్స్ కి సమాధానం చెప్పాడు. కాగా, థమన్ ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కలిపి డజను సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.