పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలలో పాటలు పాడిన సంగతి తెలిసిందే. 'తమ్ముడు' 'ఖుషి' 'గుడుంబా శంకర్' 'జానీ' 'అత్తారింటికి దారేది' 'అజ్ఞాతవాసి' వంటి సినిమాలలో సాంగ్స్ పాడి ఫ్యాన్స్ ని అలరించాడు. ఈ క్రమంలో పవన్ మరోసారి తన గొంతు సవరించుకోడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రమోషన్స్ భాగంలో పవన్ తన నెక్స్ట్ మూవీలో ఓ పాట పాడబోతున్నట్లు వెల్లడించారు.
థమన్ 'వకీల్ సాబ్' తో పాటుగా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలోనే పవన్ ఓ సాంగ్ ఆలపించబోతున్నట్లు థమన్ వెల్లడించారు. మరి పవన్ పాడబోయే పాట ఎలా ఉంటుందో చూడాలి.