బీచ్ సొగసుల విశాఖ రాజధాని ప్రకటన ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజధానిని ఇలా ప్రకటించారో లేదో అప్పుడే వైజాగ్ టాలీవుడ్ కి ఊపొచ్చింది. ఇన్నాళ్లు ఉంటుందా ఉండదా? అన్న డైలమా కొనసాగింది. అయితే ఇప్పుడు విశాఖకు రాజధాని జంప్ అనగానే అక్కడ స్థానిక నాయకులు వైజాగ్ టాలీవుడ్ అంశాన్ని బలంగా తెరపైకి తెచ్చారు. గంట గంటకు ఓ కొత్త ప్రకటన చేస్తున్నారు. అలాగే విశాఖ ఔట్ స్కర్ట్స్ లో భారీగా స్టూడియోల సెటప్ కి వైకాపా ప్రభుత్వం నుంచి అండ లభించనుందని తెలుస్తోంది.
ఇక ఇదే ఊపులో టాలీవుడ్ ప్రముఖుల్లోనూ కదలిక మొదలైంది. పలువురు సినీపెద్దలు విశాఖ- భీమిలి పరిసరాల్లో భారీగా స్టూడియోల సెటప్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సైతం విశాఖలో రికార్డింగ్ స్టూడియో నిర్మాణానికి ఆసక్తిగా ఉన్నాడట. థమన్ టైమ్ నడుస్తోందిప్పుడు. వెంకీమామ- ప్రతిరోజు పండగే- అల వైకుంఠపురములో.. ఇవన్నీ థమన్ ఖాతాలోనే. 2020లో క్షణం తీరిక లేనంత బిజీబిజీ. టాలీవుడ్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అతడి పేరే వినిపిస్తోంది. ఆ క్రమంలోనే అతడి ప్రయత్నాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
థమన్ కి భీమిలి బీచ్ పరిసరాల్లో అదిరిపోయే లొకేషన్ లో ఒక సైట్ ఉంది. ఆ సైట్లోంచి చూస్తే సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ కనిపిస్తాయట. అలాంటి చోట అదిరిపోయే స్టూడియోని సెట్ చేయాలని థమన్ ఆలోచిస్తున్నారని సమాచారం. భీమిలి భవిష్యత్ ని ఆనాడే థమన్ గుర్తించి తెలివిగా అక్కడ భూమిపై పెట్టుబడులు పెట్టాడని చెబుతున్నారు. ఇక రుషి కొండ నుంచి భీమిలి వరకూ బీచ్ పరిసరాల్లో సినిమావాళ్లకు భారీగా భూములు ఉన్నాయి. ఇప్పటికే విశాఖ-ఎఫ్.ఎన్.సీ.సీ బీచ్ పరిసరాల్లో రామానాయుడు స్టూడియోస్ కి సమీపంలో ఉంది. అక్కడికి థమన్ కొనుక్కున్న ల్యాండ్ కూతవేటు దూరంలోనే ఉంటుంది.
ఇక థమన్ సంగతి అటుంచితే.. మద్రాసు నుంచి సినీపరిశ్రమ హైదరాబాద్ కి వచ్చినప్పుడు అక్కడ స్థిరపడిన పలువురు తెలుగు వాళ్లు హైదరాబాద్ కి వచ్చి రికార్డింగ్ స్టూడియోలు పెట్టుకున్నారు. చాలా మందికి ముంబై చెన్నయ్ లాంటి చోట స్టూడియోలు ఉన్న వాళ్లే హైదరాబాద్ లోనూ స్థిరపడ్డారు. ఇప్పుడు వైజాగ్ రాజధాని సెగ టాలీవుడ్ ప్రముఖుల్ని తాకడంతో భీమిలి వైపు ఆలోచిస్తున్నారట. బీచ్ పరిసరాల్లో సరికొత్త టాలీవుడ్ విశాఖ నగరానికే వన్నె తెస్తుందనేది వీరి ఆలోచన. ఆ క్రమంలోనే వడి వడిగా అటువైపు అడుగులు వేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం వేడెక్కిస్తోంది.