ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం మంచిది కాదని నిర్మాతల మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఈ నెల 27 రావాల్సిన ‘బెంగాల్ టైగర్’ను డిసెంబరు 10కి వాయిదా వేశారు. దీంతో సైజ్ జీరో 27న సోలోగా రిలీజ్ అయిపోతోందని అంతా అనుకున్నారు. ఐతే ఆ సినిమాకు ఓ సినిమా పోటీగా వస్తోంది. ఐతే అది పెద్ద సినిమా కాదు కాబట్టి ‘సైజ్ జీరో’ టీంకి కంగారేం లేదు. గోల్కొండ హైస్కూల్ - ఉయ్యాల జంపాల లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ దర్శకుడిగా మారి తీసిన ‘తను నేను’ ఈ నెల 27నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘వయాకాం 18’తో కలిసి రామ్మోహనే స్వయంగా నిర్మించడం.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈ మధ్యే వచ్చిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై జనాల్లో బాగానే ఆసక్తి క్రియేట్ అయింది. దివంగత డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ (గోల్కొండ హైస్కూల్ ఫేమ్), అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమాలో రవిబాబు - సత్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించాడు. ఇందులో రవిబాబు పోషించిన బండ్రెడ్డి సర్వేశ్వరరావు పాత్ర హైలైట్ అవుతుందంటున్నారు. కూతురు అమెరికా వెళ్లి డబ్బులు సంపాదిస్తే.. ఆ డబ్బులతో కారు, బంగ్లా కొందామని ఈ బండ్రెడ్డి ఆశపడితే.. ఆమె ఓ కుర్రాడి ప్రేమలో పడుతుంది. అప్పుడు ఆ తండ్రికి, ఆ కుర్రాడికి మధ్య జరిగే వార్ నేపథ్యంలో సరదాగా సాగుతుందీ సినిమా. రామ్మోహన్ నిర్మాణంలో వచ్చిన సినిమాల్లాగే ఇది కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందేమో చూడాలి.