బీ టెక్ వెబ్ సీరిస్ రెడీ అయిన డైరెక్టర్

Update: 2018-11-15 07:24 GMT
తరుణ్ భాస్కర్ తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన మొదటి సినిమా 'పెళ్ళిచూపులు' సూపర్ హిట్ కావడం.. అవార్డులు కూడా సాధించడంతో దర్శకుడిగా మంచి పేరే వచ్చింది. కానీ తరుణ్ భాస్కర్ రెండో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' మాత్రం పెద్దగా మెప్పించలేదు. తన నెక్స్ట్ సినిమా వచ్చేలోపు తరుణ్ ప్రేక్షకులను ఒక వెబ్ సీరిస్ తో పలకరించబోతున్నాడు.

ఈ వెబ్ సీరీస్ టైటిల్ 'బీటెక్'. ఈ వెబ్ సీరిస్ కు తరుణ్ స్క్రిప్ట్ మాత్రమే అందించాడట.. డైరెక్ట్ చేసింది మాత్రం తన స్నేహితుడు అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర. రీసెంట్ గానే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ రిలీజ్ అయింది.  తరుణ్ ఈ వెబ్ సీరీస్ కథ గురించి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక మెసేజ్ పెట్టాడు.  తను రాసిన మొదటి స్క్రిప్ట్ ఇదేనని.. నాన్నగారు చనిపోక ముందుకు దీన్ని చదివారని తెలిపాడు. తరుణ్ రాసిన స్క్రిప్ట్ ను తరుణ్ నాన్నగారు చదవడం అదొక్కసారే జరిగిందట.

ఈ వెబ్ సీరీస్ స్టొరీ ప్రధానంగా ముగ్గురు బీటెక్ చదువుకునే విద్యార్థుల జీవితాలు వాళ్ళు తమ భవిష్యత్తు కోసం కనే కలల చుట్టూ తిరుగుతుందట.  ఈ వెబ్ సీరిస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన జీ 5 లో ఈరోజు నుండి(నవంబర్ 15) స్ట్రీమింగ్ చేస్తారట. ఇందులో 'పెళ్ళిచూపులు' ఫేమ్ అభయ్ తో పాటుగా పలువురు యంగ్ స్టర్స్ నటించారు.  


Tags:    

Similar News