కొంత మంది డైరెక్టర్లు రైటర్ల బృందాన్ని వెంట పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. పాత రోజుల్లో ఈ విధానం బాగా అమలులో ఉండేది. దర్శకులు తమకు నచ్చిన విధంగా కథ రాయించుకుని సినిమాలు చేసేవారు. రైటింగ్..డైరెక్షన్ రెండు వేర్వేరు డిపార్ట్ మెంట్లు కావడంతో పూర్తిగా డీవియేషన్ కనిపించేది. అయితే ఇప్పుడంత సీన్ లేదు. డైరెక్షన్ ఒక్కటే చేస్తానంటే కుదరదు.
రైటింగ్ పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సెట్ లో అప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేయగల సత్తా ఉండాలి. పాత రోజుల్లోలాగా చెలామణి అయిపోదామంటే కుదరదు. రెండు విభాగాల్లోనూ పట్టు సాధిస్తేనే పనవుతుంది. లేదంటే? పరిస్థితులు ఎప్పుడైనా ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. కోన వెంకట్..గోపీ మోహన్ రైటర్లతో శ్రీనువైట్ల కలిసి పనిచేసేవారు. వారిద్దరు సపరేట్ అయిన తర్వాత వైట్ల వేగం ఒక్కసారిగా తగ్గింది.
అలాగని శ్రీనువైట్లని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అతను సీనియర్ రైటర్. కాకపోతే ఆ ఇద్దరు రైటర్లు వచ్చిన తర్వాత వైట్ల సక్సెస్ బాగుండేది. ఎగ్జిట్ అయిన తర్వాత పరిస్థితి ఎలా తారుమారైందో కనిపిస్తూనే ఉంది.
తాజాగా ఓ డైరెక్టర్ ఇప్పుడు సొంతంగా సత్తా చాటాల్సిన సమయం వచ్చినట్లే కనిపిస్తుంది. ఇంత కాలం ఓ యువ రచయిత తన పక్కనే ఉండటంతో ఇద్దరు క్రియేటివిటీతో మంచి కమర్శియల్ స్టోరీలు కుదిరేవి.
ఇప్పుడా రైటర్ కి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడంతో అటెళ్లిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ డైరెక్టర్ ఇక సొంతంగా కథలు సిద్దం చేసుకోవాలి. తన కథకి తానే మాటలు.. కథనాన్ని రచించుకోవాలి. ఇదంత వీజీ కాదు. కొన్ని నెలలు పాటు శ్రమిస్తే తప్ప సరైన కథ సిద్దం కాదు. మళ్లీ దాన్ని రివ్యూ చేసుకోవాలి. అవసరమైన మార్పులుంటే చేయాలి. హీరోలేవైనా మార్పులు సూచించినా అప్పటికప్పుడు చేయాలి.
నిర్మాతలకు అనుగుణంగానూ కథను మలచాలి. ఒకేటింటి ఇలా ప్రతీది ఇప్పుడు తానొక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటిని ఇప్పటివరకూ ఆ యువ నిర్మాత చూసుకునే వాడు. ఇప్పటివరకూ ఆ డైరెక్టర్కి పెయిల్యూర్ లేదు. వెంట రైటర్ కూడా ఉండటంతో ఇతను కూడా ఆసక్సెస్ లో భాగమే . ఇకపై వచ్చే విజయాలు మాత్రం అన్ని ఆయన సొంత క్రియేటివిటీగానే భావించాలి సుమీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.