బెస్ట్ ఫ్రెండే భర్తగా వస్తే ఆ ఆనందం వేరే: కాజల్

Update: 2021-01-18 10:25 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో కళ్లతోనే కుర్రకారు మనసు దోచుకునే హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిఉంది. కాజల్ గురించి ఖైదీ150లో సరైన పాట రాసారు రచయిత.. "సన్నజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలా చుట్టేసిందిరో సుందరి" అంటూ ఆ పాటలోని పొగడ్తలు అమ్మడి అందానికి తక్కువే అనిపిస్తుంది. అలాంటి అందం, అభినయం కలిగిన కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకొని అభిమానుల హార్ట్స్ బ్రేక్ చేసిందని వాపోతున్నారు. కాజల్ అందాలను కనులారా వీక్షించడానికి అభిమానులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను కలిగిన కాజల్ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటోషూట్లతో మురిపిస్తుంది. కెరీర్ ఫస్ట్ నుండి కూడా కాజల్ గ్లామర్ గాలం వేస్తూ సినీ ప్రియులను తన గుప్పిట్లో బంధీ చేస్తోంది.

ఇప్పటికి కాజల్ సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమ్మడు మెగాస్టార్ తో మరోసారి ఆచార్య సినిమాలో జతకడుతోంది. అలాగే స్టార్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు-2 లో నటిస్తోంది. ఇక కాజల్ పెళ్లి జరిగినప్పటి నుండి తన భర్తతో కలిసి వార్తలలో నిలుస్తూనే ఉంది. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్లిన కాజల్ దంపతులు.. తాజాగా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కాజల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. 'నా బెస్ట్ ఫ్రెండే నా భర్త కావడం చాలా ఆనందంగా ఉంది' అంటూ భర్తతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఫోటోలలో కాజల్ మెరిసిపోతుంది. ప్రస్తుతం కాజల్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News