1996 లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమదేశం' లో ఒక హీరోగా నటించిన వినీత్ ఒక్కసారిగా యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా కొన్ని మాత్రం నిరాశ పర్చాయి. అయినా కూడా ఏదోలా కెరీర్ లో ముందుకు నెట్టుకు వద్దాం అనుకున్న ఆయనకు తెలుగు భాష రాకపోవడం అవరోధంలా నిలిచింది. తెలుగు భాష రాకపోవడం వల్ల మంచి కథలను ఆయన ఎంపిక చేసుకోలేక పోయాడు. దానికి తోడు ఆయన మలయాళం నుండి ఆ సమయంలో ఆఫర్లు దక్కించుకోవడం వల్ల కూడా మెల్ల మెల్లగా తెలుగు సినిమాలకు దూరం అయ్యాడు.
ఇటీవల మళ్లీ నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి టాలీవుడ్ లో రీ ఎంట్రీ కి ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. రంగ్ దే సినిమా లో చేసింది చిన్న పాత్రే అయినా కూడా అందరి దృష్టిలో పడ్డాడు. కనుక క్యారెక్టర్ ఆర్టిస్టుగా వినీత్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గతంలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వినీత్ ఇప్పటికి అదే తరహా లుక్ తో ఉన్నాడు. వయసు పెరిగినా కూడా ఫేస్ లో మరియు బాడీ లో ఎక్కువగా మార్పులు రాకపోవడం వల్ల ఆయన్ను ఇంకా కూడా చాలా మంది అభిమానిస్తారనే టాక్ వినిపిస్తుంది.
సీనియర్ హీరోయిన్ శోభన ద్వారా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన వినీత్ ఎక్కువగా క్లాస్ లుక్ పాత్రలు మరియు కాస్త ఫ్యామిలీ తరహా పాత్రలను మాత్రమే చేశాడు. మాస్ సినిమాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఆయన తక్కువ కాలంకే టాలీవుడ్ ను వదిలేయాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయం. అందుకే రీ ఎంట్రీ తో అన్ని రకాల పాత్రలు చేసేయాలని వినీత్ భావిస్తున్నాడట. హీరోలు విలన్ పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సమయంలో వినీత్ కూడా విలన్ గా ప్రయత్నిస్తే బాగుంటుందేమో..!