ఎస్వీ కృష్ణా రెడ్డి తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే, అందరూ కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆయన అదే మాటకి కట్టుబడ్డారు. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఒక వైపున కామెడీని, మరో వైపున సెంటిమెంట్ ను సమానంగా నడిపిస్తూ ఆయన అనేక విజయాలను అందుకున్నారు. అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
"నేను మా ఊరు దాటిన దగ్గర నుంచి గైడెన్స్ అంతా కూడా అచ్చిరెడ్డిగారిదే. ఈ రోజుకి కూడా ఆయన నన్ను అంటిపెట్టుకునే ఉంటారు. నన్ను డిజైన్ చేసింది .. నేను ఎందుకు పనికి వస్తానో చెప్పింది .. దర్శకత్వం వైవు నడిపించింది అచ్చిరెడ్డిగారే. అందువల్లనే నేను వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. అలా మా ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం కూడా తోడైంది. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావాలి .. అదృష్టమే భగవంతుడి అనుగ్రహం. అది లేకపోతే ఎవరూ చేసేదీ ఏమీ ఉండదనేది నా అభిప్రాయం.
సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు .. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఆ విషయాన్ని వంటబట్టించుకోవడం వల్లనే నేను గర్వాన్ని తలకెక్కనీయలేదు. అన్ని రోజులు ఒకలా ఎప్పుడూ ఉండవు .. మనకంటే టాలెంట్ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే అన్నీ నేనే చేసుకుంటూ మిగతా వాళ్లకి అవకాశం ఇవ్వలేదనే మాటను కొంతవరకూ నేను ఒప్పుకుంటాను. ఒకప్పుడు నేను వరుసగా 40 సినిమాలు చేశాను .. మరి ఇప్పుడు నాకు అవకాశాలు ఏవి? ఎవరు అవకాశం ఇస్తారు? అందుకే అవకాశం వచ్చినప్పుడు లాక్కోవాలి .. కుదిరినప్పుడు చేసుకోవాలి. నేను చేసింది అదే.
పదేళ్ల గ్యాప్ వచ్చినా ఇటు ప్రేక్షకులు గానీ .. అటు ఇండస్ట్రీగాని నన్ను మరిచిపోలేదు .. అది నా అదృష్టం. ఇప్పటికీ నా గురించి .. నా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను గానీ .. అచ్చిరెడ్డిగారు గాని ఆర్ధికంగా బాగానే ఉన్నాము. ఒక దశ తరువాత సొంత సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్లనే గ్యాప్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా మేము సొంత సినిమాలు చేసుకోగలము. చాలామంది నిర్మాతలు ఆర్ధికంగా చితికి పోవడం మేము మా కెరియర్ తొలినాళ్లలోనే చూశాము .. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము" అని చెప్పుకొచ్చారు.