నేషనల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి.సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి నిర్మించారు. ఇందులో కృష్ణంరాజు, సచిన్ ఖేద్కర్, జయరాం, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.
దాదాపు నాలుగేళ్ల పాటు సినీ ప్రియులను ఊరించిన ఈ చిత్రం.. ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. కానీ, భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించారు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశ పరిచింది.
ప్రభాస్ అభిమానులు సైతం ఈ మూవీపై పెదవి విరిచారు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. రాధేశ్యామ్ పై తొలిసారి స్పందిస్తూ ఫేల్యూర్ ను అంగీకరించారు. ఈ సందర్భంగా సినిమా రిజల్ట్ ఎందుకు తేడా కొట్టిందో కూడా వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. 'మాస్ ఇమేజ్ ఉన్న నన్ను ప్రేమ కథల్లో ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు లేదా స్క్రిప్ట్ లో లోపం ఉండవచ్చు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. పైగా రిలీజ్ టైమ్‌కి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే సినిమాకు మరింత మైనస్' అని చెప్పుకొచ్చారు.
అయితే బిగ్ స్క్రీన్ పై అలరించకపోయినా టెలివిజన్ స్క్రీన్‌పై చూసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ రాధే శ్యామ్‌ని ఖచ్చితంగా ఆస్వాదిస్తారని ప్రభాస్ పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడీయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఇటీవలె ఈయన ఓం రౌత్‌తో 'ఆదిపురుష్'ను కంప్లీట్ చేశాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'సలార్', నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్-కె', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటే మారుతితో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.